షారూఖ్‌తో కలసి పనిచేయడమంటే ఇష్టం: ప్రియమణి
5 months ago | 66 Views
షారుక్‌ఖాన్‌తో కలిసి పని చేసే అవకాశం రావాలేగానీ ఏదైనా వదిలేయడానికి సిద్ధమంటోంది సీనియర్ నటి ప్రియమణి. గతంలో 'చెన్నై ఎక్స్‌ప్రెస్’లో.. '1 2 3 4 గెట్ ఆన్ ది డాన్స్ప్లోర్’ పాటలో షారుక్‌తో ఆడిపాడిన ప్రియమణి 'జవాన్’ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటించింది. ఇటీవలే 'మైదాన్’తో అలరించిన ఈమె ఓ వేడుకలో మీడియాతో మాట్లాడుతూ.. షారుక్‌తో మళ్లీ కలిసి నటించాలనుందని మనసులో మాట బయట పెట్టింది.
'ఒకవేళ షారుక్ నన్ను పిలిచి ’రేపే వచ్చేయ్.. నాతో కలిసి పని చేయాలి’ అని చెబితే వెంటనే వెళ్లిపోతా. నా చేతిలో ఉన్న ప్రాజెక్టులన్నీ వదిలేస్తా. ఆయనతో కలిసి పని చేయడమే నాకు అన్నింటికన్నా ముఖ్యం’ అంటూ ఉత్సాహంగా చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కీలక పాత్రలో తెరకెక్కుతున్న 'ది ఫ్యామిలీమ్యాన్ 3’ వెబ్‌సిరీస్ చిత్రీకరణ త్వరలోనే ప్రారంభం కానుంది.
ఇంకా చదవండి: 'వార్-2' కోసం ముంబై చేరిన ఎన్టీఆర్!
# Priyamani # ShahRukhKhan # Jawan