జగపతిబాబు సీరియస్ లుక్!
5 months ago | 47 Views
రవితేజ కథానాయకుడిగా హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్న చిత్రం ’మిస్టర్ బచ్చన్’. పీపుల్ విూడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. భాగ్యశ్రీ బోర్సే కథానాయిక. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఇందులో జగపతిబాబు సీరియస్ లుక్‌లో ఆసక్తికరంగా కనిపించారు.
ఈ చిత్రంలో ఆయన పాత్ర చాలా శక్తిమంతంగా ఉండనుందని చిత్రవర్గాలు తెలిపాయి. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతోన్న ఈ సినిమా ఇప్పటికే ఎనభై శాతం చిత్రీకరణ పూర్తి చేసుకుంది. మిగిలిన పనుల్ని త్వరలోనే పూర్తి చేసి విడుదల తేదీ ప్రకటించనున్నారు. సంగీతం: మిక్కీ జె. మేయర్, ఛాయాగ్రహణం: అయనంక బోస్.
ఇంకా చదవండి: 'యానిమల్' కోసం ఎంతో కష్టపడ్డా: రష్మిక!
# Misterbachchan # Ravitej # Bhagyashreeborse