
అవకాశాలు పెరిగిన కయాదు లోహర్
2 days ago | 5 Views
చిన్న సినిమాలు ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి మంచి విజయాలను అందుకుంటున్నాయి. అలాంటి సినిమాల్లో 'డ్రాగన్' సినిమా ఒకటి. కోలీవుడ్ హీరో ప్రదీప్ రంగనాథన్ నటించిన ఈ చిత్రాన్ని తెలుగులోనూ రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో అందాల భామ కయాదు లోహర్ పేరు మారుమ్రోగింది. ఈ అమ్మడి అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన 'డ్రాగన్' సినిమాతో కయాదు లోహర్ అడియన్స్ హృదయాలను కొల్లగొట్టింది.
ఇప్పుడు ఎక్కడ చూసినా ఈ చిన్నదాని పేరే వినిపిస్తుంది. సినిమాలో అమ్మడి లుక్స్, యాక్టింగ్ అంతా పర్ఫెక్ట్ గా అనిపించింది. అమ్మడి ఫీచర్స్ చూసిన ఎవరైనా సరే స్టార్ మెటీరియల్ అనేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ చిన్నది తెలుగులోకి అడుగుపెట్టనుందని తెలుస్తుంది. గతంలో ఓ తెలుగు సినిమాలో నటించింది. ఇప్పుడు మరో తెలుగు సినిమాలోనూ నటిస్తుందని అంటున్నారు. 'డ్రాగన్' సినిమా పుణ్యమా అని కయాదు లోహర్ కు క్రేజీ ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. తెలుగులో ఇప్పటికే రెండు సినిమాలకు సైన్ చేసిందని తెలుస్తుంది.
ఇంకా చదవండి: పెళ్లి తర్వాత స్పీడ్ పెంచిన కీర్తిసురేష్!
Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# డ్రాగన్ # కయాదులోహర్ # ప్రదీప్‌రంగనాథన్