ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్‌ని సిద్ధం చేయాలి: 'మా' ను కోరుతూ మంచు పోస్ట్!
3 months ago | 43 Views
ఇచ్చిన మాట ప్రకారం ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్‌ని వెంటనే సిద్ధం చేయాలని మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ను కోరుతున్నానంటూ మంచు మనోజ్ పోస్ట్ చేశారు. దానికంటూ ప్రత్యేకంగా సోషల్‌విూడియా ఖాతాలు ఏర్పాటు చేయండి. మన పరిశ్రమలోని మహిళలకు గళంగా నిలవండి. తాము ఒంటరిగా లేమని.. తమ బాధను వింటామనే విషయాన్ని ప్రతి మహిళకు తెలియజేయండి. ఈ క్లిష్ట పరిస్థితుల్లో అండగా నిలబడిన మన పరిశ్రమ పెద్దలు, సహోద్యోగులకు నా మద్దతు తెలియజేస్తున్నా. న్యాయం, గౌరవం అనేది మాటల్లో మాత్రమే కాకుండా చేతల్లోనూ చూపించే విధమైన సమాజాన్ని నిర్మిద్దాం.
కుమార్తె, సోదరి, తల్లి.. ఇలా ప్రతి మహిళ కోసం ఈ పోరాటం. వారికి అన్యాయం జరగకుండా చూద్దాం'' అని మనోజ్ కోరారు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. దీనిని ఉద్దేశించి తాజాగా నటుడు మంచు మనోజ్ ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ పెట్టారు. ‘జానీ మాస్టర్.. కెరీర్ పరంగా ఈ స్థాయికి వచ్చేందుకు విూరు ఎంతలా శ్రమించారో అందరికీ తెలుసు.
కానీ, ఈ రోజు విూపై ఇలాంటి తీవ్ర ఆరోపణలు రావడం చూస్తుంటే నా హృదయం ముక్కలవుతోంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది చట్టం నిర్ణయిస్తుంది. ఒక మహిళ తన స్వరాన్ని వినిపించినప్పుడు పారిపోవడం అనేది సమాజానికి, రానున్న తరాలకు ఒక ప్రమాదకరమైన సందేశాన్ని ఇస్తుంది. ఈ కేసు విషయంలో త్వరితగతిన స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీస్, బెంగళూరు నగర పోలీస్‌లకు నా అభినందనలు. చట్టానికి ఎవరూ అతీతులు కాదని ఇది తెలియజేస్తుంది. జానీ మాస్టర్.. నిజాన్ని ఎదుర్కొండి. విూరు ఏ తప్పు చేయకపోతే పోరాటం చేయండి. విూరు దోషి అయితే.. దానిని అంగీకరించండని హితవు పలికారు.
ఇంకా చదవండి: ఆలోచించి 'దేవర' టైటిల్ ఖరారు చేశాం: అసలు విషయం చెప్పిన ఎన్టీఆర్!