ఆ డైరెక్టర్‌ లేకపోతే నేను లేను : అల్లు అర్జున్‌

ఆ డైరెక్టర్‌ లేకపోతే నేను లేను : అల్లు అర్జున్‌

1 month ago | 5 Views

‘నన్ను ‘ఆర్య’తో స్టార్‌ని చేసింది సుకుమార్‌. ఈ రోజు నేను సక్సెస్‌ఫుల్‌ హీరోగా ఉన్నానంటే కారణం సుకుమార్‌. నా ఎదుగుదలకు కారణం ఆయనే. ఇంత వేడుక జరుగుతున్నా ఆయన రాలేదు. ఇంకా సినిమా పనుల్లోనే బిజీగా ఉన్నారు. ఇన్ని డబ్బులొస్తాయి. ఇంత పేరొస్తుంది అని లెక్కలేసుకొని చేసిన సినిమా కాదది. ప్రేక్షకులకు ఓ బెస్ట్‌ ఇవ్వాలి, గొప్ప ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వాలి అని చేసిన సినిమా.


పుష్ప2’ బిగ్గెస్ట్‌ ఇండియన్‌ సినిమా అయ్యిందంటే కారణం మీ ఆదరణే.’ అని అల్లు అర్జున్‌ అన్నారు.  ఆయన కథానాయకుడిగా రూపొందిన చిత్రం ‘పుష్ప 2’. బ్లాక్‌బస్టర్‌ ‘పుష్ప’కు సీక్వెల్‌గా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్‌ పతాకంపై నవీన్‌ యర్నేని, యలమంచిలి రవిశంకర్‌ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్‌ 5న విడుదల కానుంది. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈ సినిమా ప్రీరిలీజ్‌ ఈవెంట్లను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ముంబయ్‌లో జరిగిన గ్రాండ్‌ ఈవెంట్‌లో బన్నీ మాట్లాడారు. అయిదేళ్ల ప్రయాణం ‘పుష్ప’తో స్పెషల్‌ బాండిరగ్‌ ఏర్పడేలా చేసిందని, బన్నీకి జోడీగా నటించడం, సుకుమార్‌ లాంటి జీనియస్‌తో పనిచేయడం గొప్ప అనుభవమని కథానాయిక రష్మిక మందన్నా తెలిపారు. ఇంకా నిర్మాతలు కూడా మాట్లాడారు.

ఇంకా చదవండి: వడ్డీతో సహా వస్తుంది.. గుర్తు పెట్టుకో : నయన తార

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# పుష్ప2     # అల్లు అర్జున్‌     # శ్రీలీల     # సుకుమార్‌    

related

View More
View More

trending

View More