'వెంకీ' సీక్వెల్‌  ఎవరితో చేస్తారంటే...?

'వెంకీ' సీక్వెల్‌ ఎవరితో చేస్తారంటే...?

6 months ago | 5 Views

రవితేజ హీరోగా శ్రీనువైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'వెంకీ’ 2004లో విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడమే కాదు.. ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అందులోని పలు సన్నివేశాలను తలచుకోవడమే ఆలస్యం ప్రేక్షకుల ముఖాల్లో నవ్వులు పూస్తాయి. తాజాగా ఈ సినిమా సీక్వెల్‌ ఏ హీరోతో చేస్తారనే ప్రశ్నకు శ్రీను వైట్ల సమాధానమిచ్చారు. ఆయన తాజా చిత్రం 'విశ్వం’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో 'వెంకీ’ చిత్రం  గురించి మాట్లాడారు. 'వెంకీ’ సీక్వెల్‌ ఎవరితో చేస్తాననేది చెప్పడం కష్టం. అందులో నటించే హీరో కచ్చితంగా నాకు మంచి స్నేహితుడై ఉండాలి. రవితేజ  నాకు మంచి ఫ్రెండ్‌ కాబట్టి ఆ సినిమా అంత బాగా వచ్చింది. నేను ఏ హీరోతో చేసినా వాళ్లు నాకు స్నేహితులు అవుతారు. అలాంటి రిలేషన్‌ ఉన్నప్పుడే సినిమా బాగా వస్తుంది.

ప్రస్తుతం చాలామంది టాలెంటెడ్‌ హీరోలు ఉన్నారు. వాళ్లందరూ కామెడీతో అలరిస్తున్నారు. వాళ్లలో ఎవరికైనా దీని సీక్వెల్‌ సెట్‌ అవుతుంది. ఒకరి పేరు చెప్పడం కష్టం అని చెప్పారు. 2004 మార్చి 26న విడుదలైన 'వెంకీ' సంచలనం సృష్టించింది. రవితేజ పోషించిన వెంకీ పాత్ర, హీరోయిన్‌ స్నేహ నటించిన శ్రావణి పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నాయి. హీరో ఫ్రెండ్స్‌ గ్యాంగ్‌ అలాగే గజాలాగా బ్రహ్మానందం, బొక్కా సుబ్బారావుగా ఏవీఎస్‌.. ఇలా ప్రతిఒక్కరూ వారి కామెడీతో అదరగొట్టారు. ముఖ్యంగా ట్రైన్‌ సీక్వెన్స్‌ సినిమాకే హైలైట్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ సినిమా దృశ్యాలు సోషల్‌ విూడియాలో షేర్‌ అవుతూనే ఉన్నాయి. దీనికి సీక్వెల్‌ రావాలని ఎంతోమంది కోరుకుంటున్నారు.

ఇంకా చదవండి: 'దేవర' అసలు కథంతా పార్ట్‌-2లోనే ఉంది: దర్శకుడు కొరటాల శివ వెల్లడి

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# Venky     # RaviTeja     # Sneha