'దేవర' విడుదలతో ఎన్టీఆర్ జోష్... అభిమానులకు ఎక్స్ వేదికగా కృతజ్ఞతలు
2 months ago | 5 Views
ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వం వహించిన చిత్రం 'దేవర’. జాన్వీకపూర్, సైఫ్‌అలీఖాన్ కీలక పాత్రలు పోషించారు. ఎన్నో అంచనాల మధ్య ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఈనేపథ్యంలోనే 'దేవర’ రిలీజ్‌ను పురస్కరించుకొని సినీ ప్రియులు, అభిమానులను ఉద్దేశించి ఎక్స్ (ట్విటర్) వేదికగా ఎన్టీఆర్ పోస్ట్ పెట్టారు. తాను ఎంతోకాలం నుంచి ఎదురుచూస్తున్న రోజు వచ్చిందని పేర్కొన్నారు. అభిమానులు చూపించే ప్రేమకు ఎప్పుడూ రుణపడి ఉంటానని అన్నారు.
మా సినిమాపై విూరు చూపిస్తోన్న అభిమానాన్ని చూసి చాలా సంతోషంగా ఉంది. అద్భుతమైన డ్రామా, భావోద్వేగాలతో 'దేవర' తీర్చిదిద్దినందుకు థ్యాంక్యూ కొరటాల శివ. మై బ్రదర్ అనిరుధ్.. నీ మ్యూజిక్‌తో మా ప్రపంచానికి ప్రాణం పోశావు. ఈ చిత్రానికి బలమైన సపోర్ట్‌గా నిలిచిన మా నిర్మాతలు మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె, అద్భుతంగా వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, సాబు సిరిల్‌తోపాటు టెక్నీషియన్స్ అందరికీ కృతజ్ఞతలు. నా అభిమానుల వేడుకలు చూసి నా మనసు నిండింది. విూ ప్రేమాభిమానాలకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటా. నాలానే విూరూ ఈ చిత్రాన్ని ఎంజాయ్ చేయడం చూస్తుంటే సంతోషంగా ఉంది. విూకు మరెంతో వినోదాన్ని అందిస్తానని మాటిస్తున్నా అని ఎన్టీఆర్ పేర్కొన్నారు.
ఇంకా చదవండి: 'దేవర'ను వీక్షించిన రాజమౌళి!