ఆ లెజండరీల గురించి నా పిల్లలకు చెబుతా : నటి శోభితా ధూళిపాళ్ల ఆసక్తికర పోస్ట్‌

ఆ లెజండరీల గురించి నా పిల్లలకు చెబుతా : నటి శోభితా ధూళిపాళ్ల ఆసక్తికర పోస్ట్‌

2 months ago | 5 Views

శోభిత ధూళిపాళ్ల... పేరుకి తెలిగింటి ముద్దుగుమ్మే కానీ హవా నడిపించేది మాత్రం బాలీవుడ్‌లో. అద్భుతమైన కథల ఎంపికతో పాటు తనదైన నటన శైలితో శోభిత తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. అక్కినేని నాగ చైతన్యతో ఎంగేజ్మెంట్‌ తర్వాత ఈ భామ తరుచుగా న్యూస్‌లో కనిపిస్తున్నారు. మణిరత్నం దర్శకత్వం వహించిన 'పొన్నియన్‌ సెల్వన్‌’ సినిమా ఫ్రాంచైజీతో ఆమె మరోసారి నేషనల్‌ వైడ్‌గా తన యాక్టింగ్‌ కెపాసిటీని నిరూపించుకున్నారు. 'పొన్నియన్‌ సెల్వన్‌`1’ సినిమా రిలీజై రెండు సంవత్సరాలు పూర్తయిన  సందర్భంగా చిత్ర బృందంతో కలిసి ఆమె సందడి చేశారు. ఈ క్రమంలో ఆమె సోషల్‌ విూడియాలో పెట్టిన పోస్ట్‌ ఒకటి వైరల్‌ అవుతోంది.

తమిళనాడులో అత్యంత సంచలనం సృష్టించిన 'పొన్నియిన్‌ సెల్వన్‌’ నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం తెరకెక్కించిన సినిమా పొన్నియిన్‌ సెల్వన్‌.రెండు భాగాలుగా తీర్చిదిద్దిన ఈ సినిమా ఘన విజయం సొంతం చేసుకుంది. తాజాగా ప్రకటించిన ప్రతిష్టాత్మక  ఐఫా అవార్డులలో ఈ సినిమా సత్తా చాటింది. ఉత్తమ నటుడిగా విక్రమ్‌ అవార్డ్‌ అందుకోగా, క్రిటిక్స్‌ ఛాయిస్‌లో ఉత్తమ నటిగా ఐశ్వర్యారాయ్‌ నిలిచింది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్‌ అంతా కలిసి ఫోటో షూట్‌ నిర్వహించారు. ఈ ఫోటోలను శోభిత ఇన్ట్సాలో పోస్ట్‌ చేస్తూ ఆసక్తికరమైన క్యాప్షన్‌ పెట్టారు. ఈ ఫోటోలో హీరో విక్రమ్‌తో పాటు జయం రవి, కార్తి, ఐశ్వర్యారాయ్‌, త్రిషలతో కలిసి శోభితా ధూళిపాళ్ల ఫొటోలకి పోజ్‌ ఇవ్వగా  ’వీరందరు ఎవెంజర్స్‌, నా పిల్లలకు వీళ్ల గురించి చెప్తాను’ అంటూ ఆమె తన అభిమానాన్ని చాటుకున్నారు. 2016లో బాలీవుడ్‌ విలక్షణ దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ దర్శకత్వం వహించిన 'రామన్‌ రాఘవ్‌ 2.0’ చిత్రంతో తెరంగ్రేటం చేసిన శోభిత హిందీలో  స్థిరపడిపోయారు. కాగా  2018లో అడివి శేష్‌ యాక్షన్‌ స్పై ఫిల్మ్‌ 'గూఢచారి’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. 2022లో వచ్చిన 'పొన్నియన్‌ సెల్వన్‌'తో మరోసారి జాతీయ గుర్తింపు పొందారు. మరోవైపు మేడ్‌ ఇన్‌ హెవెన్‌, ది నైట్‌ మేనేజర్‌ వెబ్‌ సీరీస్‌లతో ఆమె ఓటీటీలోను ప్రత్యేక గుర్తింపు సాధించారు.

ఇంకా చదవండి: ప్రభాస్‌ మూవీలోకి మిథున్‌ చక్రవర్తి!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# SobhitaDhulipala     # NagaChaitanya     # Bollywood    

trending

View More