మా చిత్రానికి 'టాక్సిస్' అనే టైటిల్ ఎందుకు పెట్టామంటే : యశ్ చెప్పిన వివరణ
1 month ago | 5 Views
యశ్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూమోహన్ దాస్ 'టాక్సిక్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ’ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనేది దీని ట్యాగ్ లైన్. ఇటీవలే దీని షూటింగ్ ప్రారంభమైంది. తాజాగా ఓ విూడియా ఇంటర్వ్యూలో యశ్ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ’టాక్సిక్’ అనే టైటిల్‌ను తనే సూచించినట్లు చెప్పారు. ఆ టైటిల్ పెట్టడానికి గల కారణాన్ని వివరించారు. పరిశ్రమలో ఇప్పటివరకు పిల్లల కోసం చాలా కథలు తెరకెక్కాయి. కానీ మేము ఈ సినిమాతో పెద్దలకు సందేశం ఇవ్వాలని నిర్ణయించు కున్నాం. అందుకే ’ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్ అప్స్’ అనే ట్యాగ్‌లైన్ పెట్టాం. ప్రస్తుతం మనలో చాలామంది గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాం. ’టాక్సిక్’ అనే పదాన్ని ఎన్నో సందర్భాల్లో ఉపయోగిస్తాం. మనమందరం కూడా విషపూరిత పరిస్థితుల్లో జీవిస్తున్నాం అందుకే ఈ టైటిల్, ట్యాగ్‌లైన్ చాలా సందర్భోచితంగా అనిపించాయి. కథ వినగానే టైటిల్ సూచించా అని యశ్ చెప్పారు.
దర్శకురాలు గీతూమోహన్ దాస్ గురించి యశ్ మాట్లాడుతూ.. ఆమెకు మాస్ పల్స్ తెలుసన్నారు. గతంలో ఆమె ఎలాంటి సినిమాలు చేశారు.. వాటి ఫలితమేంటి? అన్నది కాకుండా ప్రస్తుతం ఏం కథ చెప్పాలనుకుంటున్నారనేది మాత్రమే చూసినట్లు చెప్పారు. ఆమెకు సినిమా అంటే ప్యాషనని.. ఈ చిత్రంలో మహిళా పాత్రలు చాలా ఉన్నాయని వెల్లడించారు. ఆ హీరోయిన్ల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. యశ్ 19వ చిత్రంగా ’టాక్సిక్’ తెరకెక్కుతుంది. వచ్చే ఏడాది ఏప్రిల్ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ’కేజీఎఫ్’ సిరీస్ విజయాల తర్వాత యశ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలీవుడ్ నటి తారా సుతారియా ఇందులో భాగమయ్యారంటూ జరిగిన ప్రచారాన్ని తాజాగా ఆమె ఖండించారు. కథానాయికలుగా నలుగురు హీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. మొదట సాయిపల్లవి పేరు బయటకురాగా.. ఆ తర్వాత కరీనాకపూర్, శ్రుతిహాసన్, కియారా అడ్వాణీల పేర్లు వైరలయ్యాయి. ఈవిషయంలో అధికారిక ప్రకటన కోసం అందరూ ఎదురుచూస్తున్నారు.
ఇంకా చదవండి: బాలయ్య 'అన్‌స్టాపబుల్'లోకి హీరో సూర్య ఎంట్రీ