నేను ఎక్కడికీ వెళ్లినా శాఖాహారినే : సాయిపల్లవి

నేను ఎక్కడికీ వెళ్లినా శాఖాహారినే : సాయిపల్లవి

10 days ago | 5 Views

ప్రేమమ్‌, ఫిదా సినిమాలతో సిల్వర్‌ స్క్రీన్‌పై మ్యాజిక్‌ చేసింది కోలీవుడ్‌ భామ సాయిపల్లవి. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ సూపర్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సొంతం చేసుకున్న ఈ భామ శ్యామ్‌ సింగరాయ్‌ సినిమాతో హిందీలో కూడా ఎంట్రీ ఇచ్చింది. బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్న సాయిపల్లవి ఓ సినిమా షూటింగ్‌ సందర్భంగా జపాన్‌లో తనకెదురైన ఓ సంఘటనను అందరితో షేర్‌ చేసుకుంది. చిట్‌చాట్‌లో సాయిపల్లవి మాట్లాడుతూ.. జపాన్‌లో ఒక నెలపాటు షూటింగ్‌ చేశా. అక్కడ శాఖాహారం దొరకలేదు. శాఖాహారంలో కూడా చికెన్‌ బ్రాత్‌ వాటర్‌తో వండారా..? అయితే నేను తినను ఫర్వాలేదన్నా.. ఎందుకంటే ఒక జంతువు చంపి తినడంలో వచ్చే ఆరోగ్యం నాకొద్దనిపిస్తుంది.


అందుకే నేనెప్పటికీ శాఖాహారినే. నేనెక్కడికెళ్లినా శాఖాహారినే. ఓ జీవి చనిపోతే నేను తట్టుకోలేనంది. ఇంకో వ్యక్తిని హర్ట్‌ చేయడం.. పబ్లిక్‌గా ఇబ్బంది పెట్టానంటే నాకు నేను వెళ్లి ఏం అనుకోకండి అని చెప్తా. నాకు ఎక్కడినుంచి వచ్చిందో తెలియదు. నా ఎమోషన్స్‌ విషయంలో ఎప్పుడూ కాంప్రమైజ్‌ అవ్వను. రోజూ మెడిటేషన్‌ చేయకపోతే కొంచెం అన్‌బ్యాలెన్స్‌ (అసమతుల్యం)గా ఉన్నట్టు అనిపిస్తుందంటూ చెప్పుకొచ్చింది. ఇటీవలే అమరన్‌తో గ్రాండ్‌ సక్సెస్‌ అందుకున్న సాయిపల్లవి ప్రస్తుతం నాగచైతన్యతో తండేల్‌ సినిమాలో నటిస్తోంది. ఈ మూవీ 2025 ఫిబ్రవరి 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంకా చదవండి: నయనతారకు మద్రాసు హైకోర్టు నోటీసులు!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# సాయిపల్లవి     # రామాయణం     # అమరన్‌    

trending

View More