మెగాస్టార్  చిరంజీవి 'విశ్వంభర'  ఎప్పుడు?

మెగాస్టార్ చిరంజీవి 'విశ్వంభర' ఎప్పుడు?

10 days ago | 5 Views

చిరంజీవి ‘విశ్వంభర’ సినిమా కోసం మెగా అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నిజానికి ఈ సినిమా సంక్రాంతికి రావాల్సింది. కానీ ‘గేమ్‌ చేంజర్‌’ సంక్రాంతికి వస్తుండటంతో ‘విశ్వంభర’ని వాయిదా వేయాల్సొచ్చింది. ఇటీవలే చిత్రీకరణ పూర్తిచేశారు. రిలీజ్‌ డేట్‌ని మాత్రం మేకర్స్‌ ప్రకటించలేదు. అయితే.. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాను ఏప్రిల్‌ 10న విడుదల చేయడానికి నిర్మాతలు వి.రామకృష్ణారెడ్డి, ప్రమోద్‌ ఉప్పలపాటి, విక్రమ్‌రెడ్డిలు సన్నాహాలు చేస్తున్నారట.

Vishwambhara: విశ్వంభర క్రేజీ అప్డేట్.. 18 ఏళ్ళ తరువాత చిరుకి జోడీగా త్రిష

ఇదిలావుంటే.. అటు ఇటుగా అదేటైమ్‌లో ప్రభాస్‌ ‘రాజా సాబ్‌’ సినిమా కూడా విడుదలకు సిద్ధమవున్నది.ఏప్రిల్‌ రెండోవారంలో ‘రాజా సాబ్‌’ రిలీజ్‌ కానున్నట్లు గతంలోనే చిత్రయూనిట్‌ ప్రకటించింది. అయితే.. ప్రభాస్‌ అనుబంధ సంస్థ యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తున్న ‘విశ్వంభర’కు పోటీగా, ప్రభాస్‌ ‘రాజా సాబ్‌’ రావడం జరిగే పని కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏమవుతుందో చూడాలి. ఇదిలావుండగా ఇటీవలే చిరంజీవి కొత్త సినిమా ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. యువ దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెల దర్శకత్వం వహించనున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో సెట్స్‌మీదకు వెళ్లనుందని సమాచారం.

ఇంకా చదవండి: ఇంకెప్పుడూ నటించొద్దు అన్నారు : రష్మిక

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# విశ్వంభర     # చిరంజీవి     # త్రిషకృష్ణన్    

trending

View More