'గద్దర్ అవార్డ్స్'కు పూర్తి సహకారాన్ని అందిస్తాం : చైర్మన్ డా:ప్రతాని రామకృష్ణ గౌడ్

'గద్దర్ అవార్డ్స్'కు పూర్తి సహకారాన్ని అందిస్తాం : చైర్మన్ డా:ప్రతాని రామకృష్ణ గౌడ్

4 months ago | 35 Views

రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తలపెట్టిన  'గద్దర్ అవార్డ్స్'కు పూర్తి సహకారాన్ని అందిస్తామని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్  డా:ప్రతాని రామకృష్ణ గౌడ్  పేర్కొన్నారు. ఈ అవార్డ్స్ ని  సినీ ప్రముఖులు అందరితో కలిసి  విజయవంతం చేయడానికి  తెలంగాణ ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ముందుకు వస్తుందని తెలిపారు.   చాలా రోజుల నుండి ప్రభుత్వం అవార్డ్స్ చేయలేదు కాబట్టి దీన్ని గమనించి సినీ పరిశ్రమలో ఉన్న ప్రొడ్యూసర్స్ కి క్యారెక్టర్స్ కి  అలాగే 24 గ్రాఫ్స్ లో ఉన్న నిపుణులైన టెక్నీషియన్స్ అందరికీ ఈ గద్దర్ అవార్డు  ఇవ్వాలని  రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం చాలా గొప్ప విషయమన్నారు.   గద్దర్ ఒక  ప్రజా గాయకుడు. ప్రజల మనిషి. 

ఆయన పేరు పైన అవార్డు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించడం..  దీన్ని తప్పకుండా మా తెలంగాణ ఫిలిం ఛాంబర్ తరఫున కూడా మేము సపోర్ట్ చేస్తూ అందర్నీ కలుపుకొని ఈ అవార్డు ఫంక్షన్ చేయడానికి మేము ముందుంటాం. దీనికి శ్రీపద్మ విభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు, తమ్మారెడ్డి భరద్వాజ గారు కూడా సంతోషాన్ని వ్యక్తపరిచారు.  ఇంత మంచి కార్యక్రమాన్ని రూపొందించిన రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారికి,  సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి మా ధన్యవాదాలు అని  చైర్మన్ డాక్టర్ ప్రతాని రామకృష్ణ గౌడ్, వైస్ చైర్మన్స్ జేవియర్, గురురాజ్, సెక్రటరీ సాగర్ అడ్వైజర్ ఏ ఎం రత్నం సంతోషం వ్యక్తం  చేశారు.

ఇంకా చదవండి: తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసిన అధ్యక్షుడు భరత్ భూషణ్

# BharatBhushan     # Tollywood    

trending

View More