ఆలోచించి 'దేవర' టైటిల్ ఖరారు చేశాం: అసలు విషయం చెప్పిన ఎన్టీఆర్!
3 months ago | 38 Views
ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం 'దేవర’ కొరటాల శివ దర్శకుడు. సెప్టెంబర్ 27న సినిమా ప్రేక్షకుల ముందుకురానుంది. ఈనేపథ్యంలో ఇటీవల జరిగిన ఓ ప్రెస్‌విూట్‌లో తన చిత్రానికి సంబంధించిన పలు విశేషాలను తారక్ పంచుకున్నారు. సినిమా విడుదల దగ్గరవుతున్న తరుణంలో టెన్షన్‌గా ఉందన్నారు. సినిమాపై నమ్మకంగా ఉన్నానని.. టీమ్ అంతా ఎంతో కష్టపడి వర్క్ చేశామని తెలిపారు. అనిరుధ్ మ్యూజిక్‌ను మెచ్చుకుంటూ.. తన సంగీతంతో అనిరుధ్ అదరగొడుతున్నారు. ప్రస్తుతం ఆయన శకం నడుస్తోంది. విజయం అందుకున్న కొంతకాలానికి వివిధ కారణాల వల్ల చాలామంది విఫలం అవుతారు. కానీ అనిరుధ్ అలా కాదు. ఒక సినిమాకు సంగీతం ఎంత అవసరమో అతనికి బాగా తెలుసు. అతను అద్భుతమైన వ్యక్తి. అనుకున్నవిధంగా రిజల్ట్ వచ్చేవరకూ కష్టపడుతూనే ఉంటాడు. జైలర్, విక్రమ్, మాస్టర్ చిత్రాలకు ఆయన అద్భుతమైన మ్యూజిక్ అందించాడు. ఏఆర్ రెహమాన్ స్థాయికి అనిరుధ్ వెళ్తాడు. అంతర్జాతీయ చిత్రాలకూ కంపోజ్ చేస్తాడని ఎన్టీఆర్ అన్నారు.
'ఆర్‌ఆర్‌ఆర్’ మాదిరిగా, దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు చేరువయ్యే టైటిల్ పెట్టాలనుకున్నామని.. ఆ విధంగా 'దేవర’ ఫైనల్ చేశామని చెప్పారు. 'దేవర’ అంటే దేవుడు అని అర్థం అన్నారు. హీరోయిన్‌గా జాన్వీకపూర్ ను తొలుత అనుకోలేదన్నారు. కథ రాస్తున్నప్పుడు కథానాయికగా ఎవరిని ఎంచుకోవాలనే విషయంలో మాకు ఎలాంటి ఆలోచన లేదు. అలాంటి సమయంలో కరణ్ జోహార్ ఒకసారి కాల్ చేసి.. 'జాన్వీ మంచి నటి. ఆమెను మన సినిమాలో తీసుకుంటే బాగుంటుందని చెప్పారు. ఆ తర్వాత కూడా మేము ఆమెను తీసుకోవాలని అనుకోలేదు.
కానీ, జాన్వీకపూర్ ఇందులో భాగం కావాలని బలంగా కోరుకున్నారు. స్క్రిప్ట్ రైటింగ్ పూర్తయ్యే సమయానికి ఆమె టీమ్‌లోకి వచ్చారు. యాక్టింగ్, భాష విషయంలో జాన్వీ తొలుత ఎంతో కంగారుపడ్డారు. కానీ, చక్కగా యాక్ట్ చేశారు. ఆమె యాక్టింగ్‌తో షాక్‌కు గురి చేశారని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. సైఫ్ అలీఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. 'దేవర’ రెండు భాగాల్లో విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినీప్రియులను ఆకట్టుకున్నాయి. సినిమాపై అంచనాలు పెంచేశాయి.
ఇంకా చదవండి: పరిశ్రమలో మహిళల భద్రతకు కట్టుబడి ఉన్నాం.. జానీపై ఫిర్యాదు చేసిన మహిళపై గోప్యత