మనం ముందు జాగ్రత్త పడాలి.. క్యాస్టింగ్‌ కౌచ్‌పై ఆదాశర్మ!

మనం ముందు జాగ్రత్త పడాలి.. క్యాస్టింగ్‌ కౌచ్‌పై ఆదాశర్మ!

3 months ago | 29 Views

ఇండస్ట్రీలో  క్యాస్టింగ్‌ కౌచ్‌ అంశంపై అదా శర్మ స్పందించారు. ఓ ఆంగ్ల విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన జీవితంలో ఎదురైన అనుభవాలను పంచుకున్నారు. ఎప్పుడైన క్యాస్టింగ్‌ కౌచ్‌ను ఎదుర్కొన్నారా..? అన్న ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు. ’నిజం చెప్పాలంటే.. నేను నేల విూదనే కూర్చున్నాను.. సోఫా(కౌచ్‌)లో కూర్చోవాలని అనుకోలేదు’ అన్నారు. ’మనం సినిమాల్లో యాక్షన్‌ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఎంత వేగంగా ప్రతిస్పందిస్తామో.. ఎవరైనా మనతో తప్పుగా ప్రవర్తించాలని చూస్తే అంతే వేగంగా కనిపెట్టాలి. ఆ సమయంలో మనం ఏం చేయాలనేదానిపైనే దృష్టి పెట్టాలి. పక్కవారి అభిప్రాయాలను తీసుకోకూడదు. ఏ రంగంలోనైనా సపోర్ట్‌ నెట్‌వర్క్‌ కలిగి ఉండడం ముఖ్యం.

నాకు మద్దతు ఇచ్చేవారు ఇండస్ట్రీలో  చాలా మంది ఉన్నందుకు సంతోషిస్తున్నాను’ అని వివరించారు. 2008 నుంచి ప్రారంభమైన తన సినీ ప్రయాణంలో ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొన్నట్లు అదా వివరించారు. ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదురైనప్పటికీ ధైర్యంగా ముందుకు సాగినట్లు చెప్పారు. 'హార్ట్‌ ఎటాక్‌’తో తెలుగు చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు నటి అదాశర్మ. 'సన్నాఫ్‌ సత్యమూర్తి’, 'గరం’, 'క్షణం’, 'కల్కి’ చిత్రాల్లో నటించారు. గతేడాది విడుదలైన 'కేరళ స్టోరీ’ ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. అదా నటించిన 'ది గేమ్‌ ఆఫ్‌ గిర్గిత్‌’ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇంకా చదవండి: టాలెంట్‌ రుజువు చేసేకున్న విూనాక్షి

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# AdahSharma     # Tollywood    

trending

View More