ఆ ట్రెండ్‌ను అంగీకరించాల్సిందే.. : మోహన్‌లాల్
2 days ago | 5 Views
సీనియర్ హీరోలు తమ చిత్రాల్లో యువ నాయికలతో జోడీ కట్టడం, తెరపై వారితో రొమాన్స్ పండించడం భారతీయ చిత్రసీమలో సాధారణమే. అయితే ఈ ధోరణి పట్ల అసంతృప్తి వ్యక్తం చేసేవాళ్లు చాలా మంది కనిపిస్తారు. అరవై, డెబ్భై ఏళ్లు దాటిన హీరోలు కూడా అప్పుడే ఇండస్ట్రీలోకి వచ్చిన యువ కథానాయికలతో ఆడిపాడటం ఏంటనే విమర్శలు కూడా వస్తుంటాయి. తాజాగా వీటిపై మలయాళ అగ్ర హీరో మోహన్‌లాల్ స్పందించారు. చక్కటి ఆరోగ్యం, తెరపై ఫిట్‌గా కనిపిస్తామనే ఆత్మవిశ్వాసం ఉంటే కథానాయకులకు వయసు ఏమాత్రం సమస్య కాబోదని చెప్పారు. స్టార్‌డమ్ సంపాదించుకున్న హీరోలు ఇండస్ట్రీలో చాలా కాలం రాణిస్తారు కాబట్టి ఈ విషయం గురించి ఆలోచించొద్దన్నారు.
ఆయన మాట్లాడుతూ ‘ఈ ట్రెండ్ ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉంది. ఆరోగ్యం సహకరిస్తే వందేళ్ల వరకైనా నటించొచ్చు. నటీనటులకు పాత్రల ఎంపిక చాలా ప్రధానం. క్యారెక్టర్‌లో కంఫర్టబుల్‌గా ఫీల్ అవడం ముఖ్యమైన అంశం. వీటి ఆధారంగానే తమ పక్కన నటించే వారి గురించి నిర్ణయం తీసుకోవాలి. ప్రేక్షకుల ఆదరణ ఉంటే ఇలాంటి విషయాల గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అని చెప్పారు. ఇటీవలే ఆయన పాన్ ఇండియా ఫాంటసీ చిత్రం ‘బరోజ్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఇంకా చదవండి: 2025 లక్కీ ఇయర్ : నిధి అగర్వాల్