మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాం: కోర్టుకు తెలిపిన ఐశ్వర్య-ధనుష్‌

మేమిద్దరం విడిపోవాలనుకుంటున్నాం: కోర్టుకు తెలిపిన ఐశ్వర్య-ధనుష్‌

5 months ago | 5 Views

తమిళ స్టార్‌ హీరో ధనుష్‌, సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌ జంట విడాకుల కోసం ఫ్యామిలీ కోర్టుకు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే. వీరి దరఖాస్తుపై చెన్నై ఫ్యామిలీ కోర్టులో  విచారణ జరిగింది. విచారణకు వీరిద్దరూ తొలిసారి కోర్టు ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు విడిపోవడానికి గల కారణాలను కోర్టుకు తెలియజేశారు. తాము కలిసి ఉండాలనుకోవడం లేదని.. విడిపోవాలనే నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. ఇరువురి వాదనలు విన్న కోర్టు తుది విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఆ రోజున తీర్పు వెలువరించనుంది. కాగా, ధనుష్‌-ఐశ్వర్య జంట తాము విడిపోతున్నట్లు 2022 జనవరిలో ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఇద్దరూ సోషల్‌ విూడియా ద్వారా ప్రకటించారు.

’18 ఏళ్లపాటు స్నేహితులుగా, భార్యాభర్తలుగా, తల్లిదండ్రులుగా, శ్రేయోభిలాషులుగా అర్థం చేసుకొని మా ప్రయాణం కొనసాగించాం. ఇప్పుడు మేము వేరువేరు దారుల్లో ప్రయాణించేందుకు సిద్ధమయ్యాం. మేమిద్దరం విడిపోవాలని నిర్ణయించుకున్నాం’ అంటూ సోషల్‌ విూడియా ద్వారా ప్రకటన చేశారు. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పెద్దకుమార్తె అయిన ఐశ్వర్య.. 2004 నవంబర్‌ 18న ధనుష్‌ను వివాహం చేసుకుంది. వీరికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. గత రెండేళ్లుగా వీరిద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. డివోర్స్‌ ప్రకటన తర్వాత ఈ జంట వారి కుమారుల పాఠశాల కార్యక్రమాలలో కనిపించారు. ప్రస్తుతం ఇద్దరు పిల్లలూ ఐశ్వర్య వద్దే ఉంటున్నారు. అప్పుడప్పుడు తండ్రి ధనుష్‌ వద్దకు వెళ్లి వస్తున్నట్లు తమిళ విూడియా వర్గాలు పేర్కొన్నాయి.

ఇంకా చదవండి: 'అమరన్‌ అసురన్‌'లో సెల్‌ నంబర్‌ ... నిర్మాతకు విద్యార్థి లీగల్‌ నోటీసులు!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# ధనుష్‌     # ఐశ్వర్య రజనీకాంత్‌