గద్దర్‌ అవార్డులకు మేం సుముఖం: సిఎం రేవంత్‌ ప్రకటనపై స్పందించిన మెగాస్టార్‌ చిరంజీవి

గద్దర్‌ అవార్డులకు మేం సుముఖం: సిఎం రేవంత్‌ ప్రకటనపై స్పందించిన మెగాస్టార్‌ చిరంజీవి

1 month ago | 21 Views

 విశ్వంభర అవార్డు ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సినీనటుడు చిరంజీవి స్పందించారు. సినిమా అవార్డులను పునరుద్దరిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామన్నారు. గద్దర్‌ అవార్డులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిపాదనను  ఫిలిం ఛాంబర్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు.  సోమవారం హైదరాబాద్‌ లో జరిగిన విశ్వంభర అవార్డుల ప్రదానోత్సవంలో సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ .. గద్దర్‌ అవార్డులపై రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను టాలీవుడ్‌ స్పందించలేదని అన్నారు. ప్రతి యేటా జనవరిలో అందించే నంది అవార్డులను గద్దర్‌ అవార్డులతో భర్తీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్త కార్యక్రమాన్ని అమలు చేయాలనేదానిపై సూచనలు చేయాలని టాలీవుడ్‌ ను కోరారు సీఎం రేవంత్‌ రెడ్డి.. అయితే సినీ పరిశ్రమ మౌనంగా ఉంది. సినీ పరిశ్రమ పెద్దలనుంచి ఎలాంటి స్పందన లేకపోవడం బాధాకరం అన్నారు సీఎం రేవంత్‌ రెడ్డి. ఎట్టకేలకు సినీనటుడు చిరంజీవి స్పందించారు.  అవార్డులను పునరుద్దరిస్తూ సీఎం రేవంత్‌ రెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా మన్నారు. గద్దర్‌ అవార్డులు ఇవ్వాలని తీసుకున్న నిర్ణయానికి ధన్యవాదాలు అన్నారు. సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిపాదనను  ఫిలిం ఛాంబర్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ ముందుకు తీసుకెళ్లాలని సూచించారు చిరంజీవి.

ఇంకా చదవండి: ఘనంగా వరుణ్ సందేశ్ 'విరాజి' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్, ఆగస్టు 2న తగ్గించిన టికెట్ రేట్లతో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ

# Chiranjeevi     # RamCharan     # Upasana    

trending

View More