కళ్లలో నీళ్లు తిరిగాయి : థమన్‌

కళ్లలో నీళ్లు తిరిగాయి : థమన్‌

19 days ago | 5 Views

సెన్సేషనల్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌ తన సంగీతంతో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాడు. సినిమా సినిమాకు అదిరిపోయే మ్యూజిక్‌ అందిస్తూ దూసుకుపోతున్నాడు. అలాగే పాన్‌ ఇండియా రేంజ్‌ లో హిట్స్‌ అందుకుంటున్నాడు తమన్‌. ఈ యంగ్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ప్రస్తుతం చేతినిండా సినిమాలతో యమా బిజీగా ఉన్నాడు. వైవిధ్యమైన మ్యూజిక్‌ అందిస్తూ.. కొత్త కొత్త సింగర్స్‌ ను పరిచయం చేస్తున్నారు తమన్‌. ప్రస్తుతం ఓజీ సినిమాకు మ్యూజిక్‌ అందిస్తున్నారు తమన్‌. ఇక సోషల్‌ మీడియాలోనూ తమన్‌ చాలా యాక్టివ్‌ గా ఉన్నాడు. రెగ్యులర్‌గా తన సినిమా అప్డేట్స్‌ ఇస్తూ అభిమానులకు కిక్‌ ఇస్తుంటారు తమన్‌. ఇదిలా ఉంటే తాజాగా తమన్‌ షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు అందరిని ఎమోషనల్‌ అయ్యేలా చేస్తుంది. తమన్‌ షేర్‌ చేసిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది.

Thaman Shares Emotional Video Helping Old Man : కళ్లల్లో నీళ్లు తిరాగాయ్..  గుండెల్ని బరువెక్కించే వీడియో షేర్ చేసిన తమన్

‘‘కళ్లల్లో నీళ్లు తిరిగాయి.. మనసంతా సంతోషంతో నిండిపోయింది.. ఇదే ఆనందమంటే’’ అంటూ ఓ ట్వీట్‌ చేశారు తమన్‌. అంతలా ఈ ట్వీట్‌ లో ఏముందంటే.. ఈ వీడియోలో ఓ పెద్దాయన హైవే పక్కన కూర్చొని జండా ఊపుతూ కనిపించాడు. ఓ హోటల్‌ ముందు కూర్చొని జండా ఊపుతూ.. ఆ హోటల్‌ కు వచ్చి భోజనం చేయండి అంటూ చెప్తున్నాడు. అంత మండుటెండలో కాళ్లకు చెప్పులు లేకుండా.. అంత కష్టపడుతున్న ఆ పెద్దయనను చూసి అటుగా కారులో వెళ్తున్న ఓ కుర్రాడు మానవత్వం చాటుకున్నాడు. ఇంత ఎండలో కాళ్లకు చెప్పులేకుండా.. కనీసం గొడుకు కూడా లేకుండా ఉన్నావ్‌ ఏంటి అని అడగ్గా..? ఏం చేయమంటావ్‌ బాబు.. హోటల్‌ వాళ్లు గొడుగు కొంటాం అని అన్నారు.. చెప్పులు అయితే రాత్రి కుక్కలు కొరికేశాయ్‌ అని తెలిపాడు. దాంతో చలించిపోయిన ఆ కుర్రాడు.. ఓ గొడుగు, చెప్పులతో పాటు ఓ జ్యూస్‌ బాటిల్‌  కూడా కొనుకొచ్చి ఇచ్చాడు. ఆ కుర్రాడు చూపించిన దయకు చాలా కృతజ్ఞతలు బాబూ అంటూ ఆ కుర్రాడి చేతిని ముద్దాడాడు ఆ పెద్దాయన. ఈ వీడియోను తమన్‌ షేర్‌ చేశారు.
ఇంకా చదవండి: నా భర్తతో ఎలాంటి విభేదాలు లేవు : కల్పన

"Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!"

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# తమన్‌     # సినిమా    

trending

View More