రాజమౌళితో సినిమా చేయాలనుంది: నటుడు విక్రమ్ వెల్లడి
2 months ago | 41 Views
విక్రమ్ తాజా సినిమా ’తంగలాన్’ విడుదలైన అన్ని ప్రాంతాల్లో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఈ సినిమాను బాలీవుడ్‌లోనూ విడుదల చేయనున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన డబ్బింగ్ పనులు పూర్తయ్యాయి. సెప్టెంబర్ 6న ’తంగలాన్’ బీటౌన్‌లో విడుదల కానుంది. ఈనేపథ్యంలో ఆంగ్ల విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఒకే రకమైన పాత్రలంటే ఆసక్తి ఉండదు. ఒకవేళ నేను అలా చేస్తే నా అభిమానులు నిరాశ పడతారు. అలాంటి చిత్రాలు కమర్షియల్‌గా హిట్ అయినప్పటికీ ఒకేతరహా పాత్రలనే ఎందుకు ఎంచుకుంటున్నారని విూడియా కూడా నన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. అది నా శైలికి భిన్నం. అందుకే ప్రతి సినిమాకు కొత్తరకంగా ప్రయత్నిస్తాను.
ఇండస్టీల్రో ఉన్న కొంతమంది నటీనటులు మాత్రమే ఇలా భిన్నంగా ప్రయత్నిస్తుంటారు. నా సినిమా వస్తుందంటే నా అభిమానులు కొత్తదనాన్ని కోరుకుంటారు. నా చిత్రాలు ’అపరిచితుడు’, ’పొన్నియిన్ సెల్వన్’ హిందీలో మంచి విజయాన్ని సాధించాయి. త్వరలో హిందీలో విడుదల కానున్న ’తంగలాన్’ను కూడా అదేస్థాయిలో ఆదరిస్తారని ఆశిస్తున్నా. నా అభిరుచికి సరిపోయే పాత్రలు వస్తే హిందీ చిత్రాలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అలాంటి స్క్రిప్ట్‌తో ఎవరైనా సంప్రదిస్తే ఆనందంగా అంగీకరిస్తాను. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన పొన్నియిన్ సెల్వన్ భారీ ప్రేక్షకాదరణను సొంతం చేసుకోవడమే కాకుండా 4 జాతీయ అవార్డులను గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు కూడా అవార్డు వచ్చిఉంటే ఇంకా సంతోషించేవాడిని. ఆ చిత్రం చరిత్రలో నిలిచిపోతుంది. మణిరత్నం దాన్ని అద్భుతంగా తెరకెక్కించారు. రాజమౌళితో సినిమా గురించి చర్చలు జరిపిన విషయం వాస్తవమే. ఆయనతో సినిమా చేస్తాను. కానీ, దానికి సమయం పడుతుంది. భారతదేశంలోని అత్యంత గొప్ప దర్శకుల్లో రాజమౌళి ఒకరు. మేము సరైన స్క్రిప్ట్ కోసం ఎదరుచూస్తున్నాం. నేను ఇప్పటివరకు చేసిన చిత్రాల్లో ’కోబ్రా’ అత్యంత కష్టమైనది. కానీ, అది అనుకున్నస్థాయిలో ప్రేక్షకాదరణను సొంతం చేసుకోలేదు. ఒక నటుడిగా నాకు సంతృప్తినిచ్చింది. కొన్నిసార్లు సినిమాకు ప్రశంసలు వస్తాయి. కానీ, కలెక్షన్లు రావు. కోబ్రాలో నేను చేసిన ఎన్నో సన్నివేశాలు సవాలుగా అనిపించాయి.
ఇంకా చదవండి: తమిళ పరిశ్రమలో వేధింపులు ఉంటే చెప్పండి: చర్యలు తీసుకుంటామన్న నటుడు విశాల్
# Vikram # Thangalaan