నిజజీవితంలో తల్లి కావాలని ఉంది : సమంత

నిజజీవితంలో తల్లి కావాలని ఉంది : సమంత

1 month ago | 5 Views

దాదాపు ఏడాది గ్యాప్‌ తర్వాత సమంత  తెరపై కనిపించింది. అది వెండి తెర మీదు కాదు బుల్లితెరపై. ‘సిటడెల్‌: హనీ బన్నీ’  సిరీస్‌తో ఇటీవల ప్రేక్షకులను పలకరించింది సామ్‌. ఎంతోకాలంగా వెయిట్‌ చేస్తున్న ఈ సిరీస్‌ ఈ నెల ఏడో తేది నుంచి అమెజాన్‌ ఫ్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ అవుతోంది. సిరీస్‌ సాధించిన సక్సెస్‌ పట్ల ఆమె ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఇదే వేదికపై ఆమె పలు అంశాల గురించి మాట్లాడారు. ఇక నాగ చైతన్యతో డైవర్స్‌ అయినా తర్వాత తన మాతృత్వం గురించి మాట్లాడారు సమంత. ఇంతకీ ఆమె ఏమన్నారంటే.. ఇటీవల సమంత నటించిన ‘సిటడెల్‌: హనీ బన్నీ’ సిరీస్‌ ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ సిరీస్‌ లో ఆమె కశ్వీ మజ్ముందర్‌ తల్లిగా యాక్ట్‌ చేసింది. ఆ అమ్మాయి తెలివైందని, అద్భుతంగా హావభావాలు పలికించిందని కొనియాడారు సామ్‌. అయితే తనకు నిజజీవితంలో తల్లి కావాలనే కలలు ఉన్నాయి అని సామ్‌ తెలిపింది. ఆమె అమ్మగా ఉండటానికి ఇష్టపడతానని చెప్పారు. కానీ.. దీనికి ఆలస్యమైందని నేను అనుకోవట్లేదని ఆమె తెలిపారు. ప్రస్తుతం తాను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నానని ఆమె పేర్కొంది.

150 దేశాల్లో టాప్ -10 లో స‌మంత సంచ‌ల‌నం! | Samantha Ruth Prabhu Trending in  150 Countries

ఇక ‘సిటడెల్‌: హనీ బన్నీ’ కథ విషయానికొస్తే.. హనీ (సమంత)) నైనిటాల్‌లోని ఓ కాఫీ షాప్‌లో వర్క్‌ చేస్తుంటుంది. ఆమెకు నదియా అనే ఐదేళ్ల కూతురు ఉంటుంది. కెఫే కోసం సరకులు తీసుకురావడానికి మార్కెట్‌కు వెళ్లిన హనీని ఓ వ్యక్తి ఫాలో అవుతుంటాడు. అది గమనించి అక్కడి నుంచి తప్పించుకునే క్రమంలో హనీ దొరికిపోతుంది. ఏదోలా అక్కడి నుంచి తప్పించుకుని తన కుమార్తెను తీసుకుని వేరే ఊరికి వెళ్లిపోతుంది. హనీ ఉన్న ప్రదేశం తెలుసుకుని కొందరు వ్యక్తులు అక్కడికి కూడా వస్తారు. మరోవైపు చనిపోయిందనుకున్న తన భార్య హనీ బతికే ఉందన్న విషయం విదేశాల్లో ఉన్న బన్నీ (వరుణ్‌ ధావన్‌)కి తెలుస్తుంది. దాంతో ఆమెను వెతుక్కుంటూ ఇండియాకు పయనమవుతాడు. అసలు హనీ వెంట పడుతున్న ఆ వ్యక్తులు ఎవరు? ఆమె గతం ఏంటి? భార్యను వెతుక్కుంటూ వచ్చిన బన్నీకి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? చివరకు హనీని, తన బిడ్డ నదియాను బన్నీ కలిశాడా? ప్రైవేటు సీక్రెట్‌ ఏజెన్సీ నాయకుడు గురు (కేకే మేనన్‌) ఒకవైపు, ‘సిటడెల్‌’ టీమ్‌ మరోవైపు వెతుకుతున్న అర్మార్డ్‌ అనే వస్తువు ఏంటి? చివరకు అది ఎవరి వశమైంది అన్నది ఇతివృత్తం. సిటాడెల్‌ సిరీస్‌ ఆరు ఎపిసోడ్స్‌గా స్ట్రీమింగ్‌ అవుతోంది.

ఇంకా చదవండి: ప్లీజ్.. నన్ను అలా పిలవకండి : కమల్‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# సిటడెల్‌హనీబన్నీ     # సమంత     # వరుణ్‌ధావన్‌     # అమెజాన్‌ఫ్రైమ్‌    

trending

View More