కరణ్ జోహార్, సంజయ్ లీలా భన్సాలి సినిమాల్లో నటించాలనుంది: అనన్య పాండే
2 months ago | 5 Views
'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2’, 'లైగర్’, 'డ్రీమ్‌గర్ల్ 2’లాంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గరయ్యారు అనన్య పాండే. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ అలరిస్తున్నారు. తాజాగా 'కంట్రోల్’తో మరోసారి పలకరించారు. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు బాలీవుడ్‌లో కొంతమంది దర్శకుల సినిమాల్లో నటించాలనుందని మనసులో కోరికను బయటపెట్టారు. కరణ్ జోహర్ సినిమాలో హీరోయిన్‌గా నటించాలనేది నా కోరిక. ఆయన దర్శకత్వంలో వచ్చిన 'రాకీ ఔర్ రాణికి ప్రేమ్ కహానీ’లో చిన్న పాత్ర పోషించే అవకాశం వచ్చింది. కానీ, ఆయన సినిమాలో హీరోయిన్‌గా నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నా. అలాగే సంజయ్ లీలా భన్సాలీ నాకెంతో ఇష్టమైన దర్శకుడు. సంజయ్ సినిమాలో ఛాన్స్ రావాలని కోరుకుంటున్నా. కెరీర్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఎన్నో జానర్ సినిమాల్లో నటించాను. రొమాంటిక్, హారర్, బయోపిక్‌లలో ఎక్కువగా నటించాలనుంది. ప్రస్తుతం కెరీర్ పరంగా బిజీగా ఉన్నాను.
తొలి సినిమా నుంచి ఇప్పటివరకు ఎన్నో విషయాలు నేర్చుకున్నా’ అని చెప్పారు. ఇక తన సోషల్ విూడియా అకౌంట్ గురించి మాట్లాడుతూ.. 'చిన్నప్పుడు ఓ ఫేస్‌బుక్ అకౌంట్ ఓపెన్ చేశాను. అది మా అమ్మకు తెలిసి దాన్ని డీయాక్టివేట్ చేసింది. 18 ఏళ్లు నిండిన తర్వాత మళ్లీ సోషల్ విూడియాలోకి వచ్చాను. విరామ సమయంలో సోషల్ విూడియాలో ఉండడానికి ఇష్టపడతాను. నాకు నచ్చిన సినిమాల గురించి అభిమానులతో పంచుకుంటానని చెప్పారు.
ఇంకా చదవండి: 'లింగ' సెకండాఫ్ మొత్తం మార్చేశారు: దర్శకుడు కె.ఎస్ రవికుమార్ సంచలన వ్యాఖ్యలు!