ఏడాదికో సినిమా చేయాలనుకుంటున్నా \ : అమీర్‌ఖాన్‌

ఏడాదికో సినిమా చేయాలనుకుంటున్నా \ : అమీర్‌ఖాన్‌

11 hours ago | 5 Views

ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో సూపర్‌ ఫ్యాన్‌ బేస్‌ ఉన్న స్టార్‌ యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు అమీర్‌ ఖాన్‌. ఇండస్ట్రీకి ఎన్నో సూపర్‌ హిట్స్‌ అందించిన అమీర్‌ ఖాన్‌.. చాలా రోజులుగా మంచి బ్రేక్‌ కోసం ఎదురుచూస్తున్నాడు. తాజాగా ఓ చిట్‌చాట్‌ సెషన్‌లో ఈ స్టార్‌ హీరో చేసిన కామెంట్స్‌ అభిమానులు, ఫాలోవర్లలో ఫుల్‌ జోష్‌ నింపుతున్నాయి. ఓ నటుడిగా ఏడాదికో సినిమా చేయాలని అనుకుంటున్నానన్నాడు అమీర్‌ఖాన్‌.

అంతేకాదు వచ్చే పదేళ్లలో మరిన్ని సినిమాలను నిర్మించాలనుకుంటున్నానన్నాడు. అంతేకాదు తన డ్రీమ్‌ ప్రాజెక్ట్‌ మహాభారత్‌ను తెరకెక్కించాలనుకుంటున్నట్టు చెప్పాడు. ఒకవేళ నేను ఈ సినిమా చేయగలిగితే.. ఈ ప్రాజెక్టుతో ప్రతీ భారతీయుడు గర్వపడేలా చేయాలని, భారతదేశం గురించి ప్రపంచానికి చూపించాలనుకుంటున్నానన్నాడు. అవార్డ్స్‌ షోలకు నో చెప్పడం గురించి ప్రశ్నించగా.. సినిమా అనేది సబ్జెక్ట్‌ ఓరియెంటెడ్‌గా సాగుతుంది.. ప్రతీ సినిమా సొంత కథను కలిగి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సితారే జమీన్‌ పర్‌, కూలీ, లాహోర్‌ 1947 సినిమాలు అమీర్‌ ఖాన్‌ ఖాతాలో ఉన్నాయి. తలైవా నటిస్తోన్న కూలీ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తుండగా.. సతారే జమీన్‌ పర్‌, లాహోర్‌ 1947 చిత్రాలకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. 2022లో వచ్చిన 'లాల్‌ సింగ్‌ చద్దా' సినిమా బాక్సాఫీస్‌ వద్ద బోల్తా కొట్టింది. దీంతో హీరోగా కొత్త సినిమాలేమి ప్రకటించలేదు. మరి తాజా కామెంట్స్‌తో అమీర్‌ఖాన్‌ నుంచి ఇక బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలుండబోతున్నాయని అర్థం చేసుకోవచ్చు.

ఇంకా చదవండి: నాగచైనత్యను తొలిసారి శోభిత అప్పుడే చూసిందంట..!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# అమీర్‌ఖాన్‌     # బాలీవుడ్    

trending

View More