అలాంటి అబ్బాయి కావాలి : రష్మిక మందన్న

అలాంటి అబ్బాయి కావాలి : రష్మిక మందన్న

4 hours ago | 5 Views

అగ్ర కథానాయిక రష్మిక మందన్న వరుస సినిమాలతో బిజీగా ఉంది. ‘పుష్ప-2’ విజయోత్సాహంలో ఉన్న ఈ భామ తాజా ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన విషయాలను పంచుకుంది. తన లైఫ్‌లోకి రాబోయే భాగస్వామి ఎలా ఉండాలో వివరించింది. జీవితంలోని ప్రతీ మలుపులో అతను తోడుండాలని, కష్టసమయంలో అండగా నిలబడాలని, అన్నివేళల్లో భద్రతనివ్వాలని చెప్పింది. రష్మిక మందన్న మాట్లాడుతూ ‘స్త్రీ పురుష సంబంధాల్లో పరస్పర గౌరవం, నమ్మకం చాలా ముఖ్యమైన అంశాలు. ఒకరిపట్ల ఒకరికి గౌరవం ఉంటే జీవితాంతం కలిసి ఉండొచ్చు. కోపతాపాలకు దూరంగా అర్థం చేసుకునే సహృదయత కలిగి ఉండాలి. అలాంటి అబ్బాయే కావాలనుకుంటున్నా’ అని చెప్పింది. జీవితానికి తప్పకుండా ఓ తోడు అవసరమని, మన కష్టాలను పంచుకునే వారు లేని జీవితాన్ని ఊహించలేమని రష్మిక మందన్న అభిప్రాయపడిరది. ప్రస్తుతం ఆమె ‘ది గర్ల్‌ఫ్రెండ్‌’ ‘రెయిన్‌బో’ ‘సికందర్‌’ ‘ఛావా’ ‘కుబేర’ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 

ఇంకా చదవండి: కీర్తిసురేష్‌ దంపతులతో విజయ్‌ దళపతి

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# రష్మిక మందన్న     # సినిమాల    

trending

View More