'కల్కి పార్ట్‌-2' కోసం వేచిచూస్తున్నా: తలైవా.. అద్భుతంగా ఉందటంటూ నాగార్జున ప్రశంస

'కల్కి పార్ట్‌-2' కోసం వేచిచూస్తున్నా: తలైవా.. అద్భుతంగా ఉందటంటూ నాగార్జున ప్రశంస

2 days ago | 9 Views

నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన 'కల్కి 2898 ఏడీ’ తాజాగా ప్రేక్షకుల ముందుకువచ్చి మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ సినిమాపై సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాను ఉద్దేశిస్తూ అగ్ర కథానాయకులు రజనీకాంత్‌, నాగార్జున పోస్ట్‌లు పెట్టారు. చాలా అరుదుగా సినిమా విషయాలపై పోస్ట్‌ పెట్టే రజనీ 'కల్కి’ చిత్ర బృందంపై ప్రశంసలు కురిపించడంతో ప్రభాస్‌ అభిమానులు సంబరపడుతున్నారు. 'కల్కి’ అద్భుతంగా ఉంది. ఇండియన్‌ సినిమాను నాగ్‌అశ్విన్‌ మరో స్థాయికి తీసుకెళ్లారు. ఇందులో నటించిన వారికి, ఈ సినిమా కోసం పనిచేసిన అందరికీ శుభాకాంక్షలు.

దీని రెండోభాగం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని రజనీకాంత్‌ పేర్కొన్నారు. ఈ పోస్ట్‌కు దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ రిప్లై ఇస్తూ.. మాటలు రావడం లేదన్నారు. టీమ్‌ అందరి తరఫున కృతజ్ఞతలు చెప్పారు. నాగార్జున కూడా సోషల్‌ విూడియా వేదికగా టీమ్‌కు అభినందనలు తెలిపారు. 'నాగ్‌ అశ్విన్‌ మిమ్మల్ని ఒకసారి కలవాలి. అమితాబ్‌ విూరు అసలైన మాస్‌ హీరో.. విూ నటనతో మరోసారి ఆశ్చర్యపరిచారు. పార్ట్‌2లో కమల్‌ హాసన్‌ని చూడడం కోసం వేచిచూస్తున్నా. ప్రభాస్‌ నువ్వు మరోసారి సత్తా చాటావు. దీపికా చాలా అద్భుతంగా నటించారు. విూరంతా కలిసి ఇండియన్‌ సినిమా స్థాయిని మరోసారి నిరూపించారు’ అని ప్రశంసించారు. మరోవైపు 'కల్కి’పై ప్రశంసలు కురిపిస్తూ హాలీవుడ్‌ విూడియా కథనాలు రాసింది. ప్రముఖ హాలీవుడ్‌ విూడియా సంస్థ డెడ్‌ లైన్‌ /కల్కి’ అద్భుతంగా ఉందని పేర్కొంది. దీంతో ప్రభాస్‌ అభిమానులు ఈ విశేషాలను  షేర్‌ చేస్తున్నారు.

ఇంకా చదవండి: మహాభారత పాత్రల వక్రీకరణ.. 'కల్కి'పై ప్రేక్షకుల్లో అసహనం!?

# Kalki2898ad     # Prabhas     # Amitabhbachchan