వరుస సినిమాలతో విూనాక్షి జోరు!
5 months ago | 47 Views
మిస్ ఇండియా విూనాక్షి చౌదరి స్పీడ్ చూస్తుంటే.. వచ్చే ఏడాదికి టాప్ హీరోయిన్ అయి కూర్చునేలా ఉంది. ఆమె లైనప్ అలా ఉంది మరి.'ఇచ్చట వాహనములు నిలుపరాదు’ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుపెట్టిన ఈ అందాలభామ.. రెండో సినిమా 'హిట్ 2’తో హిట్ అందుకున్నది. అక్కడి నుంచి అవకాశాలు ఈ ముద్దుగుమ్మకి క్యూ కట్టాయి. తమిళ అగ్రహీరో విజయ్‌కు జోడీగా తాను నటించిన పాన్‌ఇండియా సినిమా సెప్టెంబర్ 5న విడుదల కానుంది. దుల్కర్ సల్మాన్‌కు జోడీగా నటించిన 'లక్కీభాస్కర్’ సెప్టెంబర్ 7న విడుదల కానుంది. విశ్వక్‌సేన్‌తో జతకట్టిన 'మెకానిక్ రాకీ’ అక్టోబర్ 31న రానుంది.
వెంకటేశ్, అనిల్ రావిపూడిల సినిమాలో కూడా విూనాక్షి చౌదరే కథానాయిక. వీటితోపాటు వరుణ్‌తేజ్ 'మట్కా’. ఈ లైనప్ గురించి విూనాక్షిని అడిగితే ’అంతా గాడ్ గ్రేస్. పైగా చేస్తున్నవన్నీ పాన్ ఇండియా సినిమాలే. ఓ వైపు ఆనందంగా.. మరోవైపు భయంగా ఉంది. అటు యంగ్‌స్టర్స్‌తోనూ, ఇటు సీనియర్ హీరోలతోనూ చేసే ఛాన్స్ బహుశా నాకే దక్కిందేమో..’ అంటూ ఆనందం వెలిబుచ్చింది విూనాక్షి చౌదరి.
ఇంకా చదవండి: నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలనే చేస్తా: అంజలి
# Luckybaskhar # Dulquersalmaan # Meenakshichaudhary