పిన్ని మహేశ్వరితో కలసి తమిళనాట ఆలయాల సందర్శన... తిరుమలతో అనుకోని అనుభూతి అంటున్న జాన్వీ కపూర్!!

పిన్ని మహేశ్వరితో కలసి తమిళనాట ఆలయాల సందర్శన... తిరుమలతో అనుకోని అనుభూతి అంటున్న జాన్వీ కపూర్!!

1 month ago | 17 Views

ప్రస్తుతం జాన్వీ 'మిస్టర్‌ అండ్‌ మిసెస్‌ మహి’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ చిత్రం మే 31న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా జాన్వీ చెన్నైలోని ప్రముఖ ఆలయాన్ని సందర్శించింది. ముఖ్యమైన పనులు మొదలు పెట్టే ముందు జాన్వీ కపూర్‌ తన తల్లిని తల్చుకుంటూ శ్రీదేవికి ఇష్టమైన ప్రదేశాలకు వెళ్తుంటుందన్న విషయం తెలిసిందే. ఎక్కువగా తిరుమల శ్రీవారిని దర్శించుకుంటుంటుంది. అయితే, ఈ సారి చెన్నైలోని శ్రీదేవికి ఇష్టమైన ఆలయాన్ని సందర్శించింది. తన పిన్ని మహేశ్వరితో కలిసి జాన్వీ ముప్పాత్తనం ఆలయానికి వెళ్లింది. ఈ సందర్భంగా అక్కడ ప్రత్యేక పూజలు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను జాన్వీ కపూర్‌ ఇన్‌స్టా వేదికగా అభిమానులతో షేర్‌ చేసుకుంది. ''మొదటిసారి ముప్పాత్తనం ఆలయాన్ని సందర్శించాను. చెన్నైలో అమ్మకు ఎంతో ఇష్టమైన ప్రదేశం'' అంటూ ఫొటోలకు క్యాప్షన్‌ జోడించింది.  ఆలయ సందర్శన సందర్భంగా జాన్వీ సంప్రదాయ లంగా ఓనీలో మెరిసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌గా మారాయి. : శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీకపూర్‌   తరచు తిరుమల వెళ్తుంటారు.

Janhvi Kapoor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న జాన్వీ కపూర్.. లంగావోణిలో  అచ్చ తెలుగమ్మాయిల.. - Telugu News | Janhvi Kapoor visited Tirumala  devastanam and she will attend devara shooting ...

తన సినిమా విడుదలకు ముందు, పుట్టినరోజునాడు, ప్రత్యేక తేదీల్లోనూ ఆమె తిరుమల స్వామి వారిని దర్శించుకుంటారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జాన్వీ తరచూ అక్కడకు వెళ్లడానికి గల కారణాన్ని తెలిపారు. తన తల్లి మరణించిన తర్వాత చాలా అలవాట్లను మార్చుకున్నట్లు చెప్పారు. అమ్మ ఎప్పుడూ తిరుమల దేవుడి పేరును తలచుకుంటూ ఉండేది. షూటింగ్‌ గ్యాప్‌లో కూడా నారాయణ, నారాయణ అనుకుంటుండేది. ప్రతి ఏడాది పుట్టినరోజు స్వామి వారిని దర్శించుకునేది. ఆమె చనిపోయిన తర్వాత తన పుట్టినరోజుకి నేను ఆ గుడికి వెళ్లాలని నిర్ణయించుకున్నా. అమ్మ లేకుండా మొదటిసారి తిరుమల వెళ్లినప్పుడు ఎంతో భావోద్వేగానికి గురయ్యాను. అక్కడికి వెళ్లిన ప్రతిసారి ఏదో మానసిక ప్రశాంతత లభిస్తుంది. అందుకే తరచూ వెళ్తుంటాను’ అని చెప్పారు. శ్రీదేవి తల్లి స్వస్థలం తిరుపతి కావడం గమనార్హం.

ఇంకా చదవండి: ప్రేక్షకుల ముందుకు 'కల్కి' స్పెషల్‌ బుజ్జి వెహికిల్‌!

# Meheshwari     # JanhviKapoor     # Mr.&Mrs.Mahi