స్మోకింగ్ చేస్తూ కెమెరాకు చిక్కిన విష్ణుప్రియ!
2 months ago | 5 Views
'బిగ్ బాస్' తెలుగు సీజన్ 8 అనుకున్న విధంగానే రోజుకో మలుపు తిరుగుతూ ఉంది. సెప్టెంబర్ 1న మొదలైన ఈ రియాలిటీ షోకు వచ్చిన 14 మందిలో ఆరుగురు ఎలిమినేట్ అయి ఇంటికి వెళ్లిపోయారు. ఆపై అంతకుముందు సీజన్‌లలో పాల్గొన్న వారు 8 మంది కొత్తగా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వడంతో హౌజ్ ఇప్పుడు కంటెస్టెంట్స్‌తో కలకలలాడుతుంది. వాళ్లు రాగానే ఎలిమినేషన్ జరగడం రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం కూడా జరిగిపోయి మళ్లీ అంతా నార్మల్ గేమ్‌కు వచ్చారు. అయితే ముఖ్యంగా ఈ సమయంలోనే హౌజ్‌లోని మెంబర్స్ నడవడికను బిగ్‌బాస్ యావత్ రాష్ట్ర ప్రజల ముందు ఉంచుతోంది.
ఇక కంటెస్టెంట్స్ తమ ఓపికను,అలవాట్లను కంట్రోల్ చేసుకోలేక తమ వాస్తవ ప్రవర్తనతో అడ్డంగా బుక్ అవుతున్నారు. రెండు వారాల క్రితం ఇద్దరు మేల్, ఫిమేల్ కంటెస్టెంట్స్ మధ్య ఏదో జరుగుతుందంటూ సోషల్ మీడియాలో రచ్చ కాగా తాజాగా విష్ణుప్రియ ఆ లిస్టులో చేరింది. ప్రస్తుతం ఈ సీజన్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్, ప్రజల్లో గుర్తింపు ఉన్న యాంకర్ విష్ణుప్రియ పొగ తాగుతూ కెమెరాలకు చిక్కింది. ఇటీవల హౌజ్‌లోకి వచ్చిన అనంతరం ఓ ఎపిసోడ్‌లో నిఖిల్ మణికంఠను అమాంతం ఎత్తుకెళ్లి స్విమ్మింగ్ ఫూల్ పడేస్తున్న సమయంలో బ్యాగ్రౌండ్‌లో ఉన్న స్మోకింగ్ జోన్‌లో విష్ణుప్రియ సిగరెట్ తాగుతూ కనిపించింది. అయితే, అక్కడున్నది సీత అని కొందరు డౌట్ పడినప్పటికీ ఆరోజు ఎపిసోడ్‌లో విష్ణుప్రియ ధరించిన బ్లాక్ అండ్ వైట్ బుల్లి గౌను బట్టి అక్కడున్నది విష్ణు ప్రియనే అని నిర్ధారణ చేస్తున్నారు.
ఇంకా చదవండి: 'బిగ్‌బాస్'లో గాడిదను కూడా కంటెస్టెంట్‌గా ...