ఇండియాలోనే బిగ్గెస్ట్‌ సూపర్‌ స్టార్‌..... ప్రభాస్‌పై విక్రమ్‌ ప్రశంసల వర్షం

ఇండియాలోనే బిగ్గెస్ట్‌ సూపర్‌ స్టార్‌..... ప్రభాస్‌పై విక్రమ్‌ ప్రశంసల వర్షం

3 months ago | 40 Views

 ప్రపంచస్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్న స్టార్‌ హీరో ప్రభాస్‌  ప్రస్తుతం వరుస విజయాలను అందుకుంటూ రికార్డులు సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ప్రభాస్‌ గురించి కోలీవుడ్‌ స్టార్‌ హీరో విక్రమ్‌ ఆసక్తికర కామెంట్స్‌ చేశారు.’ప్రభాస్‌ ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్‌ సూపర్‌ స్టార్‌. అతడిని తెలుగు హీరో అనడం సరికాదు’ అని విక్రమ్‌ అన్నారు. మాళవిక మాట్లాడుతూ.. ప్రభాస్‌తో కలిసి నటించే అవకాశం రావడం ఆనందంగా ఉందన్నారు. భాషపరంగా సినిమా సరిహద్దులను తొలగించారని ప్రశంసించారు. ఆయన నటించిన సినిమాలపై ప్రేక్షకులు చూపే అభిమానం చూస్తే ఆశ్చర్యమేస్తుందని చెప్పారు.  ఈ ఏడాది ’కల్కి 2898 ఏడీ’తో భారీ విజయాన్ని అందుకున్న ప్రభాస్‌.. ప్రస్తుతం వరుస పాన్‌ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.

ఆయన హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ’రాజాసాబ్‌’. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 10న ఇది ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా దీని షూటింగ్‌ అప్‌డేట్‌పై నిర్మాత క్లారిటీ ఇచ్చారు. ’ప్రభాస్‌ పాత్ర చిత్రీకరణ పూర్తయింది. సినిమా షూటింగ్‌ కూడా కంప్లీటైంది’ అని ఓ నెటిజన్‌ పెట్టిన పోస్ట్‌కు నిర్మాత శ్రీనివాస కుమార్‌ (ఎస్‌కెఎన్‌) రిప్లై ఇచ్చారు. ’ప్రభాస్‌ పాత్ర పూర్తయితే సినిమా షూటింగ్‌ అంతా కంప్లీట్‌ అయినట్లు కాదు కదా!’ అని పేర్కొన్నారు. ప్రస్తుతం దీని చిత్రీకరణ శరవేగంగా జరుగుతోందన్నారు.  రొమాంటిక్‌ హారర్‌ కామెడీ నేపథ్యంలో సిద్ధమవుతోన్న ఈ చిత్రాన్ని పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో మాళవిక మోహనన్‌తో పాటు నిధి అగర్వాల్‌, రిద్ధి కుమార్‌ కథానాయికలుగా కనిపించనున్నారు.

ఇంకా చదవండి: నిజాలు బయటపెట్టినందుకు వేధింపులు: మళయాల నటి మిను వెల్లడి

# Rajasaab     # Prabhas     # Film    

trending

View More