‘వికటకవి’ ఆడియెన్స్‌కు ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చే పీరియాడిక్ సిరీస్‌:  డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ‌ద్దాలి

‘వికటకవి’ ఆడియెన్స్‌కు ఓ డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చే పీరియాడిక్ సిరీస్‌: డైరెక్ట‌ర్ ప్ర‌దీప్ మ‌ద్దాలి

1 month ago | 5 Views

డిఫ‌రెంట్ కంటెంట్‌తో వెబ్ సిరీస్‌, సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ను మెప్పిస్తోన్న వ‌న్ అండ్ ఓన్లీ ఓటీటీ ZEE5. ఈ మాధ్య‌మం నుంచి సరికొత్త వెబ్ సిరీస్ ‘వికటకవి’ న‌వంబ‌ర్ 28 నుంచి స్ట్రీమింగ్ కానున్న సంగ‌తి తెలిసిందే. ఈ సిరీస్‌ను తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్ట్రీమింగ్ కానుంది. నరేష్ అగస్త్య, మేఘా ఆకాష్ ప్రధాన పాత్రల్లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎస్.ఆర్.టి.ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్యాషనేట్ ప్రొడ్యూసర్ రామ్ తాళ్లూరి ఈ సిరీస్‌ను నిర్మించారు. బ్లాక్ బ‌స్ట‌ర్ వెబ్‌సిరీస్ ‘స‌ర్వం శ‌క్తిమ‌యం’ను తెరకెక్కించిన డైరెక్టర్  ప్రదీప్ మద్దాలి దీనికి దర్శకత్వం వహించారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోన్న మొట్ట మొదటి డిటెక్టివ్ వెబ్ సిరీస్ ఇదే కావటం విశేషం. ఈ పీరియాడిక్ సిరీస్ గురించి దర్శకుడు ప్రదీప్ మద్దాలి ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలియ‌జేశారు. 

* ‘వికటకవి’ ప్ర‌యాణం ఎలా మొద‌లైంది?

ప్ర‌శాంత్ వ‌ర్మ‌గారితో అ!, క‌ల్కి సినిమాల‌కు వ‌ర్క్ చేసిన రైట‌ర్ తేజ దేశ్‌రాజ్‌ రాసుకున్న క‌థ‌. త‌ను నాకు మంచి స్నేహితుడు. జీ5 వారికి క‌థ‌ను వినిపించి సిరీస్‌ను చేయ‌టానికి ఒప్పించి అన్నీ సిద్ధం చేసుకున్నారాయ‌న‌. సిరీస్‌ను రూపొందించ‌టానికి జీ5 టీమ్ హీరోలను, ద‌ర్శ‌కుల‌ను కొంత‌మందితో చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఆ స‌మ‌యంలో తేజ, నేను ఓసారి క‌లుసుకున్నప్పుడు విక‌ట‌క‌వి సిరీస్ గురించి చెప్పి.. నువ్వు డైరెక్ట్ చేస్తావా! అని అడిగారు. నేను క‌థ విన్నాను. నాకు చాలా చాలెంజింగ్‌గా అనిపించింది. ఎస్ఆర్‌టి ఎంట‌ర్‌టైన్‌మెంట్ రామ్ తాళ్లూరిగారు, జీ5 టీమ్ ఓ బ‌డ్జెట్ చెప్పి అందులోనే కంప్లీట్ చేయగ‌ల‌వా? అన్నారు. నేను అంగీక‌రించాను. అక్క‌డి నుంచి విక‌ట‌క‌వితో నా ప్ర‌యాణం ప్రారంభ‌మైంది. 

* పీరియాడిక్ జోన‌ర్‌లో సిరీస్‌ను చేయ‌టం ఎలాంటి ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చింది?

విక‌ట‌క‌వి త‌ర‌హా పీరియాడిక్ సిరీస్ చేయ‌టం డైరెక్టర్‌గా నాకు మంచి ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. నాతో పాటు నా టీమ్‌కి కూడా వ‌ర్క్ ప‌రంగా డిఫ‌రెంట్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇచ్చిన కంటెంట్ ఇది. ఎందుకంటే క‌థ‌లో చాలా లేయర్స్ ఉన్నాయి. క‌థంతా 1940, 1970 కాలాల్లో జ‌రుగుతుంది. అలాంటి ప్ర‌పంచాన్ని క్రియేట్ చేసి తెర‌కెక్కించ‌టం అనేది ఓ కిక్ ఇచ్చింది. 1940, 1970 కాలాల‌కు సంబంధించిన సెట‌ప్స్‌, బ‌ట్ట‌లు, అప్ప‌టి ప్ర‌జ‌లు మాట్లాడే భాష‌, లుక్స్‌, లైటింగ్, వ‌ర్కింగ్ మూడ్ ఇలా అన్నీ టీమ్‌కి చాలెంజింగ్‌గా అనిపించింది. సిరీస్‌ను కంటెంట్ ప్ర‌కారం ఓ రాయ‌ల్ లుక్‌తో చూపిస్తూనే క‌థానుగుణంగా మంచి థ్రిల్ల‌ర్ ఎలిమెంట్‌తో తెర‌కెక్కించాను. 

* పీరియాడిక్ కాన్సెప్ట్‌తో సిరీస్‌ను తెర‌కెక్కించ‌టం అనేది ద‌ర్శ‌కుడిగా మీకు ఎలా చాలెంజింగ్ అనిపించింది?

పీరియాడిక్ కాన్సెప్ట్‌తో సిరీస్ లేదా సినిమాను తెర‌కెక్కించ‌టం అనేది ప్ర‌తీ టెక్నీషియ‌న్‌కి ఎంతో చాలెంజింగ్ విష‌యం. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని చాలా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నించాలి. కంటెంట్‌ను ఎలా తెర‌కెక్కించాల‌నుకుంటున్నామో దాన్ని తెర‌పైకి తీసుకు రావ‌టం అనేది పెద్ద చాలెంజింగ్ విష‌యం. దీని కోసం ద‌ర్శ‌కుడి ఆలోచ‌న‌కు ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌, కాస్ట్యూమ్ డిజైన‌ర్, కెమెరామెన్ ఆలోచ‌న‌లు స‌రిగ్గా స‌రిపోవాలి. అదృష్టం కొద్ది మంచి టీమ్ కుదిరింది. ప్రతీ ఒక్క‌రూ త‌మ సొంత ప్రాజెక్ట్‌గా భావించి, నిరూపించుకోవాల‌ని త‌ప‌న‌తో అంద‌రూ వర్క్ చేశారు. 

* మేకింగ్‌లో సినిమాటోగ్రాఫ‌ర్ వ‌ర్కింగ్ స్టైల్ గురించి చెప్పండి?

విక‌ట‌క‌వి సిరీస్‌కు షోయ‌బ్ అనే సినిమాటోగ్రాఫ‌ర్ వ‌ర్క్ చేశారు. త‌ను ఓ ప్రాజెక్ట్ చేశాడు. మూడు వంద‌ల‌కు పైగా పంజాబీ సాంగ్స్‌కి వ‌ర్క్ చేశారు. త‌న‌ని ఈ ప్రాజెక్ట్‌కి తీసుకొద్దామ‌ని అనుక‌న్న‌ప్పుడు చాలా మంది షాక్ అయ్యారు. అందుకు కార‌ణం.. నాకు చాలా మంది సినిమాటోగ్రాఫ‌ర్స్ ఫ్రెండ్స్ ఉన్నారు.. అలాగే ఇండ‌స్ట్రీలో టాలెంటెడ్ డీఓపీలున్నారు. ఇక్క‌డ ఇంత మంది ఉండ‌గా పంజాబీ కెమెరామెన్‌ను ఎందుకు తీసుకోవటం అని అన్న‌వాళ్లు లేక‌పోలేదు. అయితే విక‌ట‌క‌విలో డ్రామా వేరుగా ఉంది. అందుక‌నే కొత్త సినిమాటోగ్రాఫ‌ర్ అయితే బావుంటుంద‌నిపించి షోయ‌బ్‌ను తీసుకున్నాను. అలాగే ఈ సిరీస్‌కు ముందు నేను చూసిన ఓ బెంగాలీ సినిమా టెక్చ‌ర్ చూసిన‌ప్పుడు నాకెంతో న‌చ్చింది. దానికి గ్రాఫ‌ర్‌గా సంజీవ్ అనే టెక్నీషియ‌న్ వ‌ర్క్ చేశారు. ల‌క్కీగా త‌ను మా డీఓపీ షోయ‌బ్‌కు స్నేహితుడు కావ‌టం క‌లిసొచ్చింది. త‌ను అలా మా ప్రాజెక్ట్‌లో భాగ‌మ‌య్యారు. కాస్ట్యూమ్స్ చేసిన గాయ‌త్రి, ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్ కిర‌ణ్‌.. ఇలా మంచి మంచి టెక్నీషియ‌న్స్ అంద‌రూ సిరీస్‌లో పార్ట్ అయ్యారు. 

* విక‌ట‌క‌వి సిరీస్ కోసం ఎన్ని సెట్స్ వేశారు?

సిరీస్‌లో చూపించిన ప్యాలెస్ సెట్‌.. అలాగే అవ‌స‌ర‌మైన చోట మాత్ర‌మే విఎఫ్ఎక్స్ వ‌ర్క్ ఉప‌యోగించాం. ఇక దాదాపు రియ‌ల్ లోకేష‌న్స్‌లోనే షూట్ చేశాం. రామోజీ ఫిల్మ్ సిటీ, అల్యూమినియం ఫ్యాక్ట‌రీ వంటి చోట్ల లోకేష‌న్స్‌లోనే చిత్రీక‌రించాం. అయితే ఉన్న లొకేష‌న్స్‌ను క‌థ‌కు త‌గ్గ‌ట్టు మార్చుకున్నాం. దానికి ప్రొడ‌క్ష‌న్ డిజైనింగ్ టీమ్ ఎంతో స‌పోర్ట్ చేసింది. అలాగే ఆర్ఎఫ్‌సీ టీమ్ కూడా బాగా స‌పోర్ట్ చేసింది. నాకు తెలిసి ఓ సిరీస్ కోసం ఆర్ఎఫ్‌సీను ఇంత గ్రాండియ‌ర్‌గా ఎవ‌రూ ఉప‌యోగించుకోలేదు. సిరీస్‌ను చూస్తే మేం ఆర్ఎఫ్‌సీలో చేసిన‌ట్టే అనిపించ‌దు. అంత డీప్‌గా వ‌ర్క్ చేశాం.

* అమ‌రగిరి సంస్థానం అనే కాన్సెప్ట్‌ను క‌థ‌లో ఎంచుకోవ‌టానికి కార‌ణమేంటి?

స్వాతంత్య్రం రాక మునుపు మ‌న దేశంలో చాలా సంస్థానాలుండేవి. అలాంటి వాటిలో తెలంగాణ‌కు చెందిన అమ‌ర‌గిరి ప్రాంతం ఒక‌టి. రైట‌ర్ తేజ డిఫ‌రెంట్ క‌థ‌ను చెప్పాల‌నుకున్న‌ప్పుడు త‌న మైండ్‌లో వ‌చ్చిన ఐడియా ఇది. శ్రీశైలం ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తున్నారు. కొన్నాళ్ల‌లో ఊరు మునిగి పోతుంది.. అనే బ్యాక్ డ్రాప్ క‌థ‌తో విక‌ట‌క‌వి అనే ఫిక్ష‌న‌ల్ పాయింట్‌ను తీసుకున్నారు. 

* ఫిక్ష‌న‌ల్ డిటెక్టివ్ సిరీస్‌కు విక‌ట‌క‌వి అనే టైటిల్‌ను ఎందుకు పెట్టారు?

క‌థ‌కు విక‌ట‌క‌వి అనే టైటిల్‌ను పెట్టింది రైట‌ర్ తేజ‌. నిజానికి మ‌న తెలుగు సినిమాల్లో విక‌ట‌క‌వి అంటే రాయ‌ల సంస్థానంలో ప‌ని చేసిన తెనాలి రామ‌కృష్ణుడు హ‌స్య చ‌తుర‌త క‌లిగిన క‌వి అనే ఫీలింగ్ ఉంది. దీనిపై తెలుగులో సినిమాలు కూడా వ‌చ్చాయి. మ‌న‌ది ఫిక్ష‌న‌ల్ డిటెక్టివ్ సిరీస్ క‌దా, ఎందుకు విక‌ట‌క‌వి అనే టైటిల్ పెట్టార‌ని నేను అడిగాను. దానికి ఆయ‌న తెనాలి రామ‌కృష్ణుడు శ్రీకృష్ణ‌దేవ‌రాయ‌లుగారి ద‌గ్గ‌ర గూఢ‌చారిగా ప‌ని చేశారు. బ‌హ‌మ‌నీ సుల్తానుల నుంచి రాయ‌ల‌వారి రాజ్యాన్ని కాపాడ‌టంలో ఎంతో కీల‌క పాత్ర‌ను పోషించార‌ని, మ‌న క‌థ‌లో హీరోకు అలాంటి షేడ్స్ ఉండ‌టంతో విక‌ట‌క‌వి అనే టైటిల్ పెట్టాన‌ని తేజ చెప్పారు. 

* న‌రేష్ అగ‌స్త్య‌ను హీరోగా ఎంచుకోవ‌టానికి రీజ‌నేంటి?

నేను డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇవ్వ‌క ముందు మేక‌ర్స్ కొంత మంది హీరోల‌ను అప్రోచ్ అయ్యారు. కానీ వ‌ర్క‌వుట్ కాలేదు. నేను బోర్డ్ పైకి వ‌చ్చిన త‌ర్వాత న‌రేష్ అగ‌స్త్య పేరుని సూచించాను. అందుకు కార‌ణం.. ఆయ‌న రాజేంద్ర‌ప్రసాద్‌గారితో న‌టించిన సేనాప‌తి, మ‌త్తువ‌ద‌ల‌రా  చూశాను. త‌న యాక్టింగ్ న‌న్నెంతో ఆక‌ట్టుకుంది. దాంతో నేను న‌రేష్ పేరుని స‌జెస్ట్ చేశాను. ఆ స‌మ‌యంలో జీ5వాళ్లు న‌రేష్‌తో ప‌రువు సిరీస్‌ను చేస్తున్నారు. నాకు త‌న‌ను క‌ల‌వ‌టం చాలా సుల‌భ‌మైంది. లుక్ టెస్ట్ చేసిన త‌ర్వాత నాతో పాటు ఎంటైర్ టీమ్ న‌రేష్ అగ‌స్త్య‌నే విక‌ట‌క‌వి అని ఫిక్స్ అయ్యారు. న‌రేష్ రెట్రో లుక్‌లో అలా పాత్ర‌లో ఒదిగిపోయాడు. 

* న‌రేష్ అగ‌స్త్య పాత్ర‌ను ఎలా డిజైన్ చేశారు?

తెనాలి రామ‌కృష్ణుడి పాత్ర‌లోని చతుర‌త మిస్ కాకుండా ఉండేలా న‌రేష్ క్యారెక్ట‌ర్‌ను డిజైన్ చేశాం. హైద‌రాబాద్‌లో ఉండే ఓ యువ‌కుడు అప్ప‌ట్లో ఉర్దూ, తెలుగు మాట్లాడుతూ ఎలా ఉండేవాడ‌నే దానిపై రీసెర్చ్ చేసి త‌న పాత్ర‌ను రాసుకున్నాం. ఇందులో న‌రేష్ డిటెక్టివ్‌.. డ‌బ్బు కోసం అమ‌ర‌గిరి ప్రాంతంలోని స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌టానికి వ‌చ్చిన‌ప్పుడు ఏం జ‌రిగింద‌నేదే అస‌లు క‌థ‌. న‌రేష్ చాలా మంచి న‌టుడు. యాక్ట‌ర్‌గా త‌న పాత్ర‌ను స్ట్రాంగ్‌గా హోల్డ్ చేస్తారు. త‌ను నేచుర‌ల్ యాక్ట‌ర్‌. 

* మేఘా ఆకాష్ పాత్ర ఎలా ఉండ‌బోతుంది?

సీనియ‌ర్ యాక్ట‌ర్ సిజు మీన‌న్ అమ‌రగిరి ప్రాంతానికి వ‌య‌సుమ‌ళ్లిన‌ రాజుగా న‌టించారు. ఆయ‌న‌కు కొడుకు, కూతురు ఉంటారు. కూతురు కుమార్తె.. అంటే సిజు మీన‌న్ మ‌న‌వ‌రాలు పాత్ర‌లో.. అంటే అమ‌ర‌గిరి యువ‌రాణి మేఘా ఆకాష్ న‌టించింది. త‌ను సైక్రియాటిస్ట్ చ‌దువుకుంటున్న డాక్ట‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తుంది. 

* అమ‌ర‌గిరి ప్రాంతంలోని ఏ ర‌హ‌స్యాన్ని మీరు చూపించ‌బోతున్నారు?

1940ల్లో అమ‌ర‌గిరి ప్రాంతంలో ఓ ఘ‌ట‌న జ‌రిగి ఉంటుంది. 1970లో అది మ‌ళ్లీ పున‌రావృత్త‌మ‌య్యేలా ఉంటుంది.  అలా జ‌ర‌గ‌టాన్ని అక్క‌డి ప్రజ‌లు అమ్మోరు శాపంగా భావిస్తుంటారు. నిజంగానే అది అమ్మోరు స‌మ‌స్యా? అని హీరో అక్క‌డ‌కు వ‌చ్చి స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించే ప్ర‌య‌త్నం చేస్తాడు. అదేంటనేది తెలుసుకోవాలంటే సిరీస్ చూడాల్సిందే. 

* విక‌ట‌క‌వి సీజ‌న్‌ 2 ఉంటుందా?

ఉంటుందండి.. రైట‌ర్ తేజ ఇప్ప‌టికే దాని మీద వ‌ర్క్ చేస్తున్నారు. అన్నీ కుదిరితే ఇంకా పెద్ద స్కేల్‌లో విక‌ట‌క‌వి 2 ఉండ‌బోతుంది. 

* మ్యూజిక్ ప‌రంగా ఎలాంటి కేర్ తీసుకున్నారు?

విక‌ట‌క‌వి సిరీస్‌కు అజ‌య్ అర‌సాడ మ్యూజిక్ అందించారు. రీసెంట్‌గా ఆయ‌న ఆయ్ సినిమాకు సంగీతాన్ని అందించిన సంగ‌తి తెలిసిందే. త‌ను 2016 నుంచి మంచి స్నేహితుడు. ఇద్ద‌రం క‌లిసి ప‌ని చేయాల‌ని అనుకుంటుండే వాళ్లం. ఈ సిరీస్‌లోకి నేను ఎంట్రీ ఇచ్చిన త‌ర్వాత అజ‌య్‌ను క‌లిసి వ‌ర్క్ చేద్దామా? అని అడిగాను. అప్పుడే ఆయ్ సినిమా ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టార్ట్ అయ్యింది. త‌ను ముందు విక‌ట‌క‌వి మోష‌న్ పోస్ట‌ర్‌కు ఇచ్చిన థీమ్ మ్యూజిక్ అంద‌రికీ న‌చ్చింది. అలా త‌ను మా ప్రాజెక్ట్‌లోకి అడుగు పెట్టాడు. ఇక విక‌ట‌క‌వి పీరియాడిక్ క‌థ‌తో సాగే సినిమా కాబ‌ట్టి వింటేజ్ ట‌చ్‌తో సాగేలా సిరీస్‌కి బ్యాగ్రౌండ్ స్కోర్‌ను అందించారు. 

* విక‌ట‌క‌విలో మిగిలిన కీల‌క పాత్ర‌లేవి?

న‌రేష్ అగ‌స్త్య‌, మేఘా ఆకాష్ కాకుండా రాజు పాత్ర‌లో సిజు మీన‌న్‌, ఎమ్మెల్యే పాత్ర‌లో ర‌ఘు కుంచె, ముక్తార్ ఖాన్‌, తార‌క్ పొన్న‌ప్ప‌, ర‌మ్య రామ‌కృష్ణ, అశోక్ కుమార్‌, అమిత్ తివారిగారు.. ముఖ్య పాత్ర‌ల్లో న‌టించారు.  

* నెక్ట్స్ ప్రాజెక్ట్స్ ఏంటి?

ఓ న్యూ ఏజ్ ఐడియాతో సైఫై హార‌ర్ క‌థ‌ను తయారు చేసే ప‌నిలో ఉన్నాను. ఓ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఫాంట‌సీ మీద వ‌ర్క్ చేస్తున్నాను.

ఇంకా చదవండి: 'జైలర్‌' దర్శకుడితో ఎన్టీఆర్‌ మూవీ..?

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# వికటకవి     # నరేష్ అగస్త్య     # మేఘా ఆకాష్    

trending

View More