రష్మికతో ప్రేమలో పడ్డ విజయ్.. అసలు విషయం చెప్పకనే చెప్పేసిన రౌడీబాయ్!
1 month ago | 5 Views
రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ ఎట్టకేలకు రష్మికతో తన బంధాన్ని బయట పెట్టాడు. ఇటీవల రిలీజైన ’సాహిబా’ సాంగ్ ప్రమోషన్స్ లో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్టార్ కంపోజర్ జస్లీన్ రాయల్ తో పాటు హీరోయిన్ రాధికా మదన్ పాల్గొని విజయ్ లవ్ లైఫ్ సీక్రెట్స్ ని బయటపెట్టారు. దీంతో ఎట్టకేలకు రష్మిక, విజయ్ సంబంధం ఏంటో తెలిసిపోయింది అంటున్నారు ఫ్యాన్స్. ఇంతకీ విజయ్ ఏమన్నారంటే.. సెన్సేషనల్ మ్యూజిక్ కంపోజర్ జస్లీన్ రాయల్ ’హీరీయే హీరీయే’ సాంగ్ సక్సెస్ తర్వాత విజయ్ దేవరకొండ, రాధికా మదన్ కాంబినేషన్ లో ’సాహిబా’ సాంగ్ రూపొందిచిన విషయం తెలిసిందే. ఈ సాంగ్ మంచి వ్యూస్ సంపాందించుకొని యూట్యూబ్ లో దూసుకుపోతున్న నేపథ్యంలో టీమ్ చిట్ చాట్ నిర్వహించారు.
ఈ నేపథ్యంలోనే టీమ్ విజయ్ ని లవ్ రిలేషన్షిప్ గురించి అడిగారు. విజయ్ ఆ ప్రశ్నలకి ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. ఆయన మాట్లాడుతూ.. ’నేను నా కో స్టార్ ఒకరితో డేటింగ్ లో ఉన్నాను. నా వయసు 35, నేను ఒంటరిగా ఉంటానని విూరు ఎలా భావించారు. రొమాంటిక్ రిలేషన్షిప్ లోకి వెళ్లేముందే నేను ఆ వ్యక్తులతో క్లోజ్ గా ఫ్రెండ్షిప్ చేస్తాను. నేను ప్రత్యేకించి డేట్‌లకు వెళ్ళాను, ఎవరితోనైతే చాలా కాలం నుండి ఫ్రెండ్షిప్ ఉంటాదో వాళ్ళతోనే బయటకెళ్తాను. నాకు షరతులు లేని ప్రేమ కావాలి. నాకు ప్రేమించడం తెలుసు, ప్రేమను తీసుకోవడం తెలుసు’ అన్నారు. అయితే ఇప్పటికే రష్మికకి, విజయ్ కి మధ్యలో మంచి స్నేహం ఉంది. దీపావళి కూడా కలిసి సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో విజయ్, రష్మికతో రిలేషన్షిప్ లో ఉన్నట్లు ఫిక్స్ చేసేస్తున్నారు నెటిజన్లు.
ఇంకా చదవండి: 'పుష్ప-2' విడుదలతో పూనకం.. విశాఖలో భారీ కటౌట్ ఏర్పాటులో అభిమానులు!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# విజయ్ దేవరకొండ # రష్మిక