
'పుష్ప-3'లో విజయ్ దేవరకొండ హీరో..?
3 months ago | 5 Views
సోషల్ మీడియా వచ్చాక జనాల్లో క్రియేటివిటీ పెరిగిపోయింది. వార్తలు వండటంలో ఒక్కొక్కరూ ఆరితేరిపోతున్నారనే చెప్పాలి. వాటిల్లో ఎక్కువ శాతం గాలివార్తలే ఉండటం చేత, నిజాలు చెప్పినా నమ్మే పరిస్థితి ప్రస్తుతం సమాజంలో లేదు. రీసెంట్‌గా ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. వివరాల్లోకెళ్తే.. ‘పుష్ప 2’ హిట్ అవ్వడంతో ‘పుష్ప3’ ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ‘పుష్ప2’ ఎండింగ్ లో ‘పుష్ప 3-ర్యాంపేజ్’ అంటూ మూడో పార్ట్‌ని దర్శకుడు సుకుమార్ ప్రకటించేశారు.
దాంతో ఇప్పుడు ‘పుష్ప 3’ గురించి ఆసక్తికరమైన ఓ వార్త ఫిల్మ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తున్నది. ‘పుష్ప 3’ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా ఉంటుందనేది ఈ వార్త సారాంశం. బాంబ్ బ్లాంస్టింగ్‌లో శ్రీవల్లి మినహా పుష్పరాజ్ అండ్ ఫ్యామిలీ చనిపోతారట. శ్రీవల్లికి విజయ్ దేవరకొండ పుడతాడట. మూడో పార్టంతా దేవరకొండ చుట్టూనే తిరుగుతుందట. ఇందులో నిజం ఎంతుందో తెలీదుకానీ.. వార్త మాత్రం బలంగానే వినిపిస్తున్నది. వినడానికి కూడా గమ్మత్తుగా ఉంది. మరి ఇందులో నిజం ఆ సుకుమార్‌కే తెలియాలి.
ఇంకా చదవండి: తగ్గిన 'పుష్ప-2' టికెట్ ధరలు
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# పుష్ప3 # అల్లుఅర్జున్ # రష్మికమందన్నా # విజయ్‌దేవరకొండ