సరికొత్త కాన్సెప్ట్ తో వస్తున్న వరుణ్ తేజ్
1 month ago | 5 Views
మెగా హీరో వరుణ్ తేజ్‌కి ఈ మధ్య అసలు కలిసి రావట్లేదన్న విషయం తెలిసిందే. అప్పుడెప్పుడో ఫిదా, తొలిప్రేమ సినిమాలతో సాలిడ్ హిట్లు అందుకున్న ఈ కుర్ర హీరో కెరీర్ గ్రాఫ్ సడన్‌గా పడిపోయింది. ఆపరేషన్ వాలంటైన్, గాండీవ ధారి అర్జున, గని, సినిమాలతో వరుస డిజాస్టార్‌లను అందుకున్నాడు. ఇప్పుడు 'మట్కా' సినిమాతో తాజాగా మరో డిజాస్టార్‌ను ఖాతాలో వేసుకున్నాడు.
ఈ సినిమా ఎంతటి పరాజయం అందుకుంది అంటూ కనీసం పెట్టిన బడ్జెట్ కూడా రాకపోవడం విశేషం. ఇదిలావుంటే వరుణ్ తేజ్ ప్రస్తుతం యాక్షన్ సినిమాలను పక్కనపెట్టి కొత్త జానర్‌లో సినిమా చేయబోతున్నట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, ఎక్స్‌ప్రెస్ రాజా సినిమాలతో సూపర్ హిట్లు అందుకున్న దర్శకుడు మేర్లపాక గాంధీతో వరుణ్ తేజ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ను చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ హారర్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్నట్లు సమాచారం.. మెగా హీరో వరుణ్ తేజ్ కూడా ఫస్ట్ టైం ఈ జానర్‌లో సినిమా చేయబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి నెలలో సెట్స్ మీదకి వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌లు సంయుక్తంగా నిర్మించబోతున్నాయి.
ఇంకా చదవండి: రాజమౌళి.. మహేష్‌బాబు బిజీ..బిజీ : నమ్రత