'ఉషా పరిణయం' చిత్రాన్ని అందరూ థియేటర్‌కు వెళ్లి చూసి సక్సెస్ చేయాలి: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్
4 months ago | 52 Views
నువ్వేకావాలి, మన్మథుడు, మల్లీశ్వరి వంటి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ చిత్రాలను తెరకెక్కించిన ప్రముఖ దర్శకుడు కె.విజయ్‌భాస్కర్ దర్శకత్వంలో తాజాగా మరో లవ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ రాబోతుంది. ఉషా పరిణయం అనే బ్యూటిఫుల్ టైటిల్‌తో రూపొందిన ఈ చిత్రానికి లవ్ ఈజ్ బ్యూటిఫుల్ అనేది ఉపశీర్షిక. కె.విజయ్‌భాస్కర్ స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రంలో శ్రీకమల్, తాన్వీ ఆకాంక్ష, సూర్య ముఖ్యతారలు. ఆగస్టు 2న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా కె.విజయ్‌భాస్కర్ మీడియాతో ముచ్చటించారు ఆ విశేషాలివి. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా
సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ 'తన్వీ ఆకాంక్షకు అన్నయ్యగా ఈ ఫంక్షన్‌కు వచ్చాను. విజయ్‌భాస్కర్ దర్శకత్వలో నేను ప్రేమకావాలి అనే సినిమా చేయాల్సింది అది మిస్ అయ్యింది. ఆది సాయికుమార్ నా రేయ్ చేయాలి.. ఆది ప్రేమకావాలి చేశాడు. నేను రేయ్ చేశాను. అలా మారిపోయింది. కమల్ నాకు జిమ్‌లో పరిచయం మంచి హార్డ్‌వర్కర్. ఈ రోజు హీరోగా చేయడం హ్యపీగా వుంది. ఆర్.ఆర్.ధ్రువన్ సంగీతం చాలా బాగుంటుంది. ఆల్ దబెస్ట్ . నాకు ఎంతో ఆప్తుడు అయిన సతీష్ అన్న కూతురు ఈ చిత్ర హీరోయిన్ తన్వీ. తన్వీ కూడా మా రికమండేషన్‌తో ఈ సినిమా చేయడం లేదు. ఎంతో కష్టపడి షార్ట్ ఫిల్మ్స్ చేసి ఈ అవకాశం పొందింది. కొత్తవాళ్లతో చేస్తున్న ఈ సినిమా థియేటర్‌కు వెళ్లి సినిమా చూస్తే..ఇలాంటి కొత్త సినిమాలు మరిన్ని వస్తాయి. విజయ్‌భాస్కర్ గారికి మంచి విజయా చేకూరాలి' అన్నారు.
దర్శకుడు విజయ్ భాస్కర్ మాట్లాడుతూ 'సాయి ద రియల్‌హీరో.. సాయి దుర్గ తేజ్ హీరోగానే కాకుండా సమాజం గురించి కూడా ఆలోచిస్తాడు. పద్నాలుగేళ్ల తరువాత సాయిను చూస్తున్నాను. సాయిని 14 ఏళ్ల క్రితం పవన్‌కల్యాణ్ గారి నిర్మాణ సారథ్యంలో నేనే హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలి కానీ కుదరలేదు. ఆ రోజు ఎంత వినయంగా, సంస్కారంతో వున్నాడో.. ఈ రోజు అలాగే వున్నాడు, చిరంజీవి గారి దగ్గర వున్న ప్రేమ సాయిలో కనిపించింది. మమ్ములను టీమ్‌ను ఎంకరైజ్ చేయడానికి వచ్చినందుకు ఆనందంగా వుంది. నాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మా ఫ్యామిలీ సపోర్ట్‌తో ఈ సినిమా నిర్మించాను. ఈ చిత్రానికి ధ్రువన్ చాలా మంచి సంగీతం ఇచ్చాడు. మా ఇద్దరికి ట్యూన్ అయ్యింది. సతీష్ ఫోటోగ్రఫీ ఈసినిమాకు ఎంతో ప్లస్ అయ్యింది. తన్వీ స్వీటెస్ట్ గర్ల్. చాలా కంఫర్టబుల్ హీరోయిన్. నో ప్రాబ్లెమ్ గర్ల్. కాశ్మీర్‌లో ఎంత ఇబ్బంది అయినా అంత చలిలో కూడా ఎంతో సహకరించింది. సినిమాలో టెక్నిషియన్స్, ఆర్టిస్ట్ కూడా ఎంతో ఓన్ చేసుకుని ఈ సినిమా చేశారు' అన్నారు.
హీరో శ్రీకమల్ మాట్లాడుతూ 'అందరి పూర్తి సహకారంతో ఓ మంచి సినిమాను అందిస్తున్నాం. అనుకున్న టైమ్ కంటే ముందే షూటింగ్‌ను పూర్తిచేశాను. సాయి దుర్గ తేజ్‌కు నేను అభిమానిని. ఆయన రావడం ఎంతో మధురానుభూతి. సాయి అన్నరావడం నా జీవితంలో మరిచిపోలేను. ఈ సినిమాను అందరూ థియేటర్‌లో చూసి మమ్ములను ఎంకరైజ్ చేయాలని కోరుకుంటున్నాను. నాన్న గారు నాకు దేవుడు. ఆయన పేరు నిలబెట్టడానికి ప్రయత్నిస్తాను. తాన్వీ ఆకాంక్ష.. చాలా మంచిగా పెంచారు. చాలా కంఫర్టబుల్ నో ప్రాబ్లమ్ గర్ల్. ఆమెతో మళ్లీ మళ్లీ పనిచేయాలని కోరుకుంటున్నాను. మా చెల్లి, బావ ఈ సినిమా నిర్మాణంలో ఎంతో సహకరించారు. అందరికి సినిమా నచ్చుతుందని ఆశిస్తున్నాను అన్నారు.
హీరోయిన్ త్వాన్వీ ఆకాంక్ష మాట్లాడుతూ 'సాయి దుర్గ తేజ్ అన్న రావడం చాలా సంతోషంగా వుంది. నేను సక్సెస్ అవుతుంటే ఆనందపడే వ్యక్తుల్లో సాయి అన్న ఒకరు. అన్న అంటే నాకు చాలా గౌరవం. నాకు ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పడు నాన్న మొదట సాయి అన్నకే చెప్పాడు. మీరు చాలా సంతోషపడ్డారని తెలిసింది. విజయ్‌భాస్కర్ గారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. సినీ పరిశ్రమలోకి రావాలన్న నా కోరిక ఈ సినిమా తీరింది. సినిమా పట్ల ఆయన ఎంతో అంకితభావం వున్న వ్యక్తి. ఈ సినిమాలో అవకాశం వచ్చినప్పుడు అందరూ నువ్వు చాలా లక్కీ అన్నారు. కమల్‌తో పనిచేయడం చాలా కంఫర్ట్‌గా వుంది. కమల్‌లో మంచి నటుడు,డ్యాన్సర్ వున్నాడు. ఈ సినిమా చూస్తున్నప్పుడు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమాకు పనిచేసిన అందరికి ఎంతో థ్యాంక్స్. కాస్ట్యూమ్ ఈ రోజు అంత అందంగా వున్నయాంటే దానికి కారణం శామ్ అక్క. తప్పకుండా ఈ చిత్రం అందరికి నచ్చుతుందని
నాకు నటిగా మంచి గుర్తింపు ఇస్తుందనే నమ్మకం వుంది' అన్నారు.
కాస్ట్యూమ్ డిజైనర్ శాన్వి మాట్లాడుతూ సాయి దుర్గ తేజ్ వచ్చినందుకు ఎంతో సంతోషంగా వుంది. మీ మదర్ నేమ్ మీ పేరులో యాడ్ చేయడం రియల్లీ గ్రేట్. ఈ సినిమా కోసం అందరూ ఎంతో కష్టపడ్డారు. కమల్ మంచి నటుడు. రేపు సినిమా విడుదల తరువాత అందరికి తెలుస్తుంది. తప్పకుండా చిత్రం అందరికి నచ్చుతుందనే నమ్మకం వుంది అన్నారు.
నటుడు రవిశివ తేజ మాట్లాడుతూ 'విజయ్‌భాస్కర్ గారు ఆర్టిస్ట్ ఎవరైనా సరే పాత్రకు సరిపోతే వాళ్ల నుంచి నటనను రాబట్టుకుంటాడు. దటీజ్ ఆయన గ్రేట్‌నెస్. ఆ కాన్ఫిడెన్స్‌తోనే అందరూ కొత్తవాళ్లతో ఉషా పరిణయంను తీశాడు. సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ప్రేక్షకులు ఎంటర్‌టైన్ అయ్యే అన్ని ఎలిమెంట్స్ వున్నాయి. ఈ సినిమా కోసం నా భార్య శాన్వి ఎంతో కష్టపడింది. తన నాన్న విజయ్‌భాస్కర్ ఇబ్బంది పడకూడదని ప్రొడక్షన్‌లో అన్నీ తానై చూసుకుంది. శాన్వీ నా వైఫ్ అయ్యినందుకు ఎంతో గర్వంగా వుంది. ఈ సినిమాలో నేను కూడా ఓ మంచి పాత్ర చేశాను. హీరోగా కమల్ ఇరగదీశాడు. ఇంతమంది కష్టపడి చేసిన ఈ సినిమా తప్పకుండా సక్సెస్ సాధిస్తుందనే విశ్వాసం వుంది అన్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నటుడు శివాజీ రాజాతో ఫణి, సంగీత దర్శకుడు ఆర్.ఆర్.ధ్రువన్, కెమెరామెన్ సతీష్ ముత్యాల, కో-డైరెక్టర్ కాళీ తదిరులు పాల్గొన్నారు.
ఇంకా చదవండి: 'యానిమల్'తో ఎంతో నేర్చుకున్నా: తృప్తి దివ్రిూ
# UshaPariyanam # SaiDurgaTej # VijayaBhaskar # August2