జితేందర్ రెడ్డి టీమ్ ను అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

జితేందర్ రెడ్డి టీమ్ ను అభినందించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

1 month ago | 5 Views

రాకేష్ వర్రే టైటిల్ రోల్ పోషిస్తున్న చిత్రం జితేందర్ రెడ్డి. ఉయ్యాలా జంపాల, మజ్ను సినిమాలు తీసిన విరించి వర్మ దర్శకత్వం వహించారు. 1980 కాలంలో జగిత్యాల చుట్టు పక్కల జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన సినిమా ‘జితేందర్ రెడ్డి’. ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి రవీందర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నిజ జీవిత సంఘటనల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కడం ఆసక్తికర అంశం. ఈ సినిమా ఈ నెల 8న ప్రేక్షకులు ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. నేడు ఈ సినిమాని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు చూసి జితేందర్ రెడ్డి గారి తో ఆయనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.


ఈ సందర్భంగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ : గతంలో నేను జితేందర్ రెడ్డి గారు కలిసి భారతీయ జనతా పార్టీ యువ మోర్చాలో పనిచేసాము. ఆయన రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ మరియు అఖిల భారత విద్యా పరిషత్ కార్యకర్తగా వ్యవహరించారు. ఆయన అప్పట్లోనే పేద ప్రజలను, బడుగు బలహీన వర్గాల ప్రజలను సంఘటితం చేసి వాళ్ళ కష్టాలను తెలుసుకొని వాళ్ల కోసం నిలబడిన వ్యక్తి. జాతీయ భావజాలంతో, వీరోచిత పోరాట పటిమతో చరిత్రలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్న గొప్ప వ్యక్తి జితేందర్ రెడ్డి. వరంగల్ లో అప్పట్లో జరిగిన అటల్ బిహారీ వాజ్పేయి గారి సభకు తనవంతుగా జగిత్యాల ప్రాంతం నుంచి 50 బస్సుల ద్వారా పేద ప్రజలను, యువకులను సంఘటితం చేసి ఆ మీటింగ్ ని విజయవంతం చేసిన వ్యక్తి జితేందర్ రెడ్డి. తనకు ప్రాణహాని ఉందని తెలిసి కూడా వెనుతిరగకుండా ప్రజల కోసం ప్రజలతో ఉంటూ పోరాటం చేసిన వ్యక్తి. 72 బుల్లెట్లు ఆయన శరీరంలోకి దింపి నక్సలైట్లు అయినను ఏవిధంగా హత్య చేశారు అనేది ఈ సినిమాలో చూపించడం జరిగింది. హింస ద్వారా ఏది సాధించలేము అని చెప్పడమే ఆయన ప్రయత్నం. ఇప్పటికీ ఎంతోమంది తుపాకుల ద్వారా హింస ద్వారా అనుకున్నది సాధించవచ్చు అనుకోవడం తప్పు, ఆలోచన మార్చుకోవాలి అనే విధంగా ఉంది ఈ సినిమా. జితేందర్ రెడ్డి తండ్రిగారైన ముదిగంటి మల్లారెడ్డి గారు సాత్విక స్వభావులు. తన కుమారుడు పోరాటంలో చనిపోతాడు అని తెలిసి కూడా ఆయన ఎక్కడా అడ్డుకోకుండా ప్రజల కోసం నిలబెట్టిన వ్యక్తి. ఈ రోజున  రవీందర్ రెడ్డిగారు తన సోదరుడైన జితేందర్ రెడ్డి యొక్క చరిత్రను ప్రజలకు తెలియజేయాలి అనుకొని ఈ చిత్రాన్ని నిర్మించడం చాలా మంచి విషయం. ముఖ్యంగా రాకేష్ వర్రే జితేందర్ రెడ్డి గారి పాత్రలో ఒదిగిపోయి చాలా చక్కగా నటించారు. అదేవిధంగా ఈ చిత్రాన్ని ఇంత చక్కగా దర్శకత్వం వహించినటువంటి విధించే వర్మ కు నా అభినందనలు తెలియజేస్తున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగం ద్వారా బుల్లెట్ కంటే బ్యాలెట్ గొప్పది అని చెప్పడం జరిగింది. కావున నక్సలైట్లు నక్సలిజం వదిలిపెట్టి ప్రజాస్వామ్యం వైపు రావాలని కోరుకుంటున్నాను అన్నారు.

నటీనటులు :

రాకేష్ వర్రే, వైశాలి రాజ్, రియా సుమన్, ఛత్రపతి శేఖర్, సుబ్బరాజు, రవి ప్రకాష్ తదితరులు

టెక్నీషియన్స్ :

దర్శకుడు: విరించి వర్మ

నిర్మాత: ముదుగంటి రవీందర్ రెడ్డి

సహ నిర్మాత: ఉమ రవీందర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వాణిశ్రీ పొడుగు

ఛాయాగ్రాహకులు: వీ ఎస్ జ్ఞాన శేఖర్

సంగీత దర్శకులు: గోపి సుందర్

ఎడిటర్:  రామకృష్ణ అర్రం 

పీఆర్: మధు వి ఆర్

ఇంకా చదవండి: రెబెల్ స్టార్ ప్రభాస్ నట జైత్రయాత్రకు 22 ఏళ్లు

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# జితేందర్ రెడ్డి     # రాకేష్ వర్రే     # రియా సుమన్    

trending

View More