బిజీగా మారిన త్రిష .. సినిమాల మీద సినిమాలు!

బిజీగా మారిన త్రిష .. సినిమాల మీద సినిమాలు!

19 days ago | 5 Views

బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీగా ఉన్న స్టార్‌ హీరోయిన్లలో టాప్‌లో ఉంటుంది చెన్నై సోయగం త్రిష. ఈ భామ ప్రస్తుతం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో లీడింగ్  హీరోలతో సినిమాలు చేస్తోంది. త్రిష ఖాతాలో అజిత్‌ కుమార్‌ నటిస్తోన్న విదాముయార్చి, చిరంజీవి నటిస్తోన్న 'విశ్వంభర' సినిమాలున్నాయి. దీంతోపాటు మాలీవుడ్‌ యాక్టర్‌ టొవినో థామస్‌ నటిస్తోన్న ప్రాజెక్ట్‌ కూడా ఉంది.  కాగా 2025 జనవరిలో త్రిష అభిమానులు, ఫాలోవర్లకు డబుల్‌ ట్రీట్‌ ఇవ్వబోతుందన్న వార్త నెట్టింట రౌండప్‌ చేస్తోంది. విదాముయార్చి 2025 పొంగళ్‌ కానుకగా రాబోతున్నట్టు మేకర్స్‌ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు టొవినో థామస్‌ సినిమా కూడా జనవరిలోనే రాబోతుంది.

నాలుగు పదుల వయసులోనూ వరుస సినిమాలతో బిజీగా ఉంటుంది. పెళ్లి మాటే ఎత్తకుండా  తన ఫోకస్ మొత్తం చిత్రాలపైనే పెట్టేసింది. | TV9 Telugu

టొవినో థామస్‌తో చేస్తున్న ఐడెంటిటీ  మలయాళంలో త్రిష రెండో ప్రాజెక్ట్‌. ఈ రెండు సినిమాల విడుదల తేదీలపై క్లారిటీ రావాల్సి ఉండగా.. తాజా వార్తల ప్రకారం ఒకేసారి త్రిష డబుల్‌ ట్రీట్‌ ఇవ్వబోతుండటం ఖాయమైనట్టే. ఈ లెక్కన త్రిష అభిమానులకు మాత్రం పండగే అని చెప్పాలి. మరోవైపు మోహన్‌ లాల్‌తో రామ్‌, అజిత్‌ కుమార్‌-అధిక్‌ రవిచంద్రన్‌ గుడ్‌ బ్యాడ్‌ అగ్లీ ప్రాజెక్ట్‌, మణిరత్నం-కమల్‌ హాసన్‌ థగ్‌ లైఫ్‌ సినిమాలు కూడా త్రిష లైన్‌లో ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన 'విదాముయార్చి' టీజర్‌కు మంచి స్పందన వస్తోంది.

ఇంకా చదవండి: అవును వచ్చే నెలలోనే నా పెళ్లి : కీర్తి సురేష్‌

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !

# త్రిష     # విదాముయార్చి     # విశ్వంభర    

trending

View More