జోరు తగ్గని త్రిష.. ‘థగ్‌ లైఫ్‌’లో బిజీబిజీ!!

జోరు తగ్గని త్రిష.. ‘థగ్‌ లైఫ్‌’లో బిజీబిజీ!!

1 month ago | 5 Views

త్రిష కథానాయికగా సినిమాల్లో అడుగుపెట్టి 20 ఏళ్లు పైనే అయింది. అయినా తన జోరు ఇప్పటికీ తగ్గలేదు. అందం, అభినయంతో ఇప్పటికీ తన క్రేజ్‌ను అలాగే మెయిన్‌టెన్‌ చేస్తోంది. ప్రస్తుతం మరో చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. కమల్‌ హాసన్‌  కథానాయకుడిగా దర్శకుడు మణిరత్నం తెరకెక్కిస్తున్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’ పాన్‌ ఇండియా స్థాయిలో రూపొందుతున్న చిత్రమిది. సముద్రపు దొంగల నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన సంగతి తెలిసిందే.


తాజాగా ఈ చిత్రంలో త్రిషతో ఓ పాట సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నట్లు ఇన్‌స్టా వేదికగా  చిత్రబృందం వెల్లడించింది. ఇందులో శింబు, జోజు జార్జ్‌, నాజర్‌, గౌతమ్‌ కార్తిక్‌, పంకజ్‌ త్రిపాఠి, అలీ ఫజల్‌, అభిరామి, ఐశ్వర్య లక్ష్మి కీలక పాత్రలు పోషిస్తున్నారు. రాజ్‌కమల్‌ ఫిల్మ్స్‌ ఇంటర్నేషనల్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ చిత్రం త్వరలో సినీ ప్రియుల ముందుకు రానుంది. ఈ చిత్రంతోపాటు త్రిష చిరంజీవి హీరోగా నటిస్తున్న'విశ్వంభర' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. వశిష్ట దర్శకత్వంలో యువి. క్రియేషన్స్‌ సంస్థ భారీ బడ్జెట్‌తో నిరిస్తోంది. సంక్రాంతికి విడుదల కావలసిన ఈ చిత్రం వాయిదా పడిన సంగతి తెలిసిందే.

ఇంకా చదవండి: బాక్సాఫీస్‌ను రూల్‌ చేయబోతున్న విజయ్‌!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# థగ్‌ లైఫ్‌     # త్రిష    

trending

View More