ట్రెండీగా.. మూడో సీజన్ తో ముస్తాబైన ఇస్మార్ట్ జోడి
2 hours ago | 5 Views
ప్రేమ..భాషతో పని లేని పదం.. మాట చెప్పలేని పదం.. కళ్ళకు మాటలు నేర్పే పదం.. పెదాలతో ఓనమాలు దిద్దించే పదం.. ప్రేమ!! అది ఓ మ్యాజిక్. ఆ మ్యాజిక్ తో స్టార్ మా "ఇస్మార్ట్ జోడి సీజన్ 3"ని ప్రారంభిస్తోంది. గత రెండు సీజన్లు విజయవంతంగా ముగించుకుని ఇప్పుడు సరికొత్తగా మూడో సీజన్ తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. టెలివిజన్ ప్రయోక్త గా, షో నిర్వాహకుడిగా, సినిమా దర్శకుడిగా, వివిధ ప్లాట్ ఫార్మ్స్ లో ప్రేక్షకుల్ని సమ్మోహన పరచి, స్పష్టమైన ముద్ర వేసిన ఓంకార్ "ఇస్మార్ట్ జోడి సీజన్ 3"ని మరింత ట్రెండీ గా, తరాలతో పాటు మారుతున్న అభిరుచుల్ని కూడా ఆకర్షించేలా అందించబోతున్నారు. సెలబ్రిటీ జంటల మధ్య అనుబంధానికి, అన్యోన్యతకి, అనురాగానికి కావాల్సినంత వినోదం కలిపి ఓ కొత్త ఫార్ములాతో రాబోతోంది "ఇస్మార్ట్ జోడి సీజన్ 3".
ఏదో ఒక ప్లాట్ ఫార్మ్ లో ప్రేక్షకులకు దగ్గరలో వుండే జంటలు సీజన్ 3 కి డిఫరెంట్ లుక్ తీసుకురాబోతున్నారు. ప్రదీప్, సరస్వతి ; అనిల్ జీలా, ఆమని ; అలీ రెజా, మసుమా ; రాకేష్, సుజాత; వరుణ్, సౌజన్య ; యష్, సోనియా ; మంజునాథ, లాస్య ; ఆదిరెడ్డి, కవిత ; అమర్ దీప్, తేజు - ఈ సీజన్ లో పాల్గొంటున్న జంటలు. వీరు అన్ని తరాలకు ప్రతినిధులు. కొత్తగా పెళ్లి చేసుకున్నవారు, కొంత జీవితం చూసినవారు, సలహాలు సూచనలు ఇచ్చే స్థాయి అందుకున్నవారు అందరూ ఈ షో ని హుందాగా పరిపూర్ణమైన కుటుంబ సభ్యులనే భావనను ప్రేక్షకులకు అందించబోతున్నారు
స్టార్ మా లో షో అంటే కేవలం వినోదమే కాదు.. బాధ్యత కూడా. ఈ షో లో కూడా అంతర్లీనంగా జంటలకు ఏం చెప్పగలం అనే విషయం కూడా ఆలోచించింది షో బృందం. ఈ షో వినోదంతో అలరించడమే కాదు. ఆలోచింపచేస్తుంది. జంటలు మరింత ప్రేమగా ఉండేందుకు పరోక్షంగా సలహాలిస్తుంది. బంధం బలంగా ఉండడానికి ఏం చేయాలో సూచనలు చేస్తుంది.
ప్రతి ప్రేమా గొప్పదే. నిజానికి గొప్పగా నిలబడితేనే అది ప్రేమ అవుతుంది. అలాంటి ప్రేమలో ఏది బెస్టో చెబుతుంది ఈ షో. అంతటితో ఆగిపోదు. ప్రతి ప్రేమలో నిజాయితీని, బలాబలాల్ని, వెలుగు నీడల్ని తెలుస్తుంది. గెలుపు, ఓటములు పక్కన పెడితే ప్రతి జంటతో ఏదో ఒక విషయాన్ని చెబుతుంది "ఇస్మార్ట్ జోడి సీజన్ 3". అందుకే ఈ షో లో ప్రతి జంట ముఖ్యం. వాళ్ళు పాల్గొనే ప్రతి రౌండ్ ముఖ్యం. ప్రతి ఆటా అంతే ముఖ్యం. ప్రతి పోటీ ముఖ్యం.
ప్రేమే పెద్ద పరీక్ష అయితే.. ఆ ప్రేమకే పరీక్ష అంటున్నారు ఓంకార్. ప్రేమ ఓ గమ్యమైతే.. ఆ ప్రయాణానికి పరీక్ష "ఇష్మార్ట్ జోడి సీజన్ 3". ప్రేమ ఒక తపస్సు అయితే.. ఆ ఏకాగ్రతకి పరీక్ష "ఇష్మార్ట్ జోడి సీజన్ 3". స్టార్ మా లో ఈ శనివారం రాత్రి 9 గంటలకు "గ్రాండ్ లాంచ్ ఈవెంట్" తో ఈ షో ప్రారంభం కానుంది. ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9 గంటలకు ఈ షో ప్రసారం కానుంది. ఈ వీక్ ఎండ్ వినోదాన్ని ఎవరూ మిస్ కాకండి.
ఇంకా చదవండి: వీబీ ఎంటర్టైన్మెంట్స్ పదో వార్షికోత్సవం 2023-2024 బుల్లితెర అవార్డులను నిర్వహించిన బొప్పన విష్ణు
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# ఇస్మార్ట్ జోడి3 # ఓంకార్ # స్టార్ మా