ముఫాసా పాత్రకు టాలీవుడ్‌ స్టార్‌ మహేశ్‌ బాబు

ముఫాసా పాత్రకు టాలీవుడ్‌ స్టార్‌ మహేశ్‌ బాబు

1 month ago | 5 Views

హాలీవుడ్‌ సూపర్‌ హిట్‌ బ్లాక్‌ బస్టర్స్‌ ప్రాజెక్టుల్లో టాప్‌లో ఉంటుంది ‘ది లయన్‌ కింగ్‌’. ఈ క్రేజీ ప్రాజెక్టుకు ప్రీక్వెల్‌గా వస్తోంది ‘ముఫాసా: ది లయన్‌ కింగ్‌’. ఇక ఈ మూవీ తెలుగు వర్షెన్‌లో ముఫాసా పాత్రకు టాలీవుడ్‌ స్టార్‌ మహేశ్‌ బాబు  వాయిస్‌ ఓవర్‌ అందించిన విషయం తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో మూవీ రిలీజ్‌ కౌంట్‌ డౌన్‌ మొదలైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ.. మహేశ్‌ తాజాగా ఎక్స్‌లో ‘హకునా.. మటాటా’ అంటూ ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. మరో నెల రోజుల్లో ఈ మూవీ రిలీజ్‌ కాబోతోందని.. ముఫాసాను చూసేందుకు సిద్ధంగా ఉండండి అంటూ రాసుకొచ్చారు. ఈ మేరకు ట్రైలర్‌ను ఈ ట్వీట్‌కు జతచేశారు. ప్రస్తుతం మహేశ్‌ ట్వీట్‌ వైరల్‌గా మారింది.

ఇంకా చదవండి: ఇక థియేటర్ల ముందు సినిమా రివ్యూలకు నో ..!?

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# ముఫాసా: ది లయన్‌ కింగ్‌     # మహేశ్‌ బాబు    

trending

View More