ఆ వ్యాఖ్యలు 'పుష్ప'ను ఉద్దేశించి కాదు: పవన్ వ్యాఖ్యలపై నిర్మాత రవిశంకర్ క్లారిటీ
3 months ago | 44 Views
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గత నెల బెంగళూరు పర్యటనలో ఉన్నప్పుడు అడవుల నరికివేతపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఇంతకుముందు సినిమాల్లో హీరోలు అడవులని కాపాడేవారు. కానీ ఈరోజుల్లో గొడ్డళ్లు పట్టుకొని, స్మగ్లింగ్ చేయడం అడవులను నరికివేయడం హీరోయిజం అయిపోయింది. నేను ఆ పరిశ్రమలో ఉన్నానని అలోచించుకుంటే అప్పుడప్పుడు బాధగా అనిపిస్తుంటుంది. ఇలాంటివి తగ్గి మళ్లీ అడవుల ప్రాముఖ్యత తెలిసేలా సినిమాలు రావాలని పవన్ కళ్యాణ్ చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు అల్లు అర్జున్‌ను ఉద్దేశించి చేసినవే అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు. అల్లు అర్జున్ నటిస్తున్న 'పుష్ప' సినిమాలో గొడ్డళ్లు పట్టుకొని, స్మగ్లింగ్ చేయడం అడవులను నరికివేయడం లాంటివి ఉండడంతో కావాలని వ్యాఖ్యలు చేస్తున్నాడని అల్లు ఫ్యాన్స్ పవన్‌పై విమర్శలు గుప్పించారు. ఇదిలా వుంటే తాజాగా ఈ వివాదంపై 'ఉస్తాద్ భగత్ సింగ్' నిర్మాత రవిశంకర్ క్లారిటీ ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు అల్లు అర్జున్ 'పుష్ప 2’ను ఉద్దేశించి కాదని క్లారిటీ ఇచ్చారు. పవన్ అలా ఎప్పుడు మాట్లాడరని.. మెగా ఫ్యామిలీ అంతా ఒక్కటే అని చెబుతాడని చెప్పుకొచ్చాడు. ఇక 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా గురించి మాట్లాడుతూ.. ఈ మధ్యే పవన్ కల్యాణ్‌ను కలిశాను. త్వరలోనే 'ఉస్తాద్ భగత్‌సింగ్’ షూటింగ్ ప్రారంభిస్తాం. వచ్చే ఏడాది జనవరి నాటికి షూటింగ్ పూర్తి చేయాలి అనుకుం టున్నాం. సెప్టెంబర్ 2 పవన్ బర్త్‌డే నాడు ఓ సర్‌ప్రైజ్ కచ్చితంగా ఉండబోతుంది అంటూ రవి శంకర్ చెప్పుకొచ్చాడు.
ఇంకా చదవండి: ''పాట రాసాను..పాడాను'' అంటున్న ఫరియా!
# Pushpa2 # AlluArjun