2న విడుదలవుతున్న 'తిరగబడరసావిూ..'  రాజ్‌తరుణ్‌ వివాదంతో సర్వత్రా ఉత్కంఠ!

2న విడుదలవుతున్న 'తిరగబడరసావిూ..' రాజ్‌తరుణ్‌ వివాదంతో సర్వత్రా ఉత్కంఠ!

5 months ago | 43 Views

రాజ్‌ తరుణ్‌, దర్శకుడు ఎఎస్‌ రవికుమార్‌ చౌదరి కాంబినేషన్‌ లో వస్తున్న'తిరగబడరసావిూ’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా ఆగస్ట్‌ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజ్‌ తరుణ్‌ సరసన వివాదాస్పద నటి మాల్వి మల్హోత్రా కథానాయికగా నటిస్తోంది. ఈ చిత్రం ప్రచార వీడియోలు ఈమధ్యనే విడుదలయ్యాయి, సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్‌ అవుతున్నాయి.


రాజ్‌ తరుణ్‌ ప్రియురాలు అని చెప్పుకుంటున్న లావణ్య కారనంగా ఇప్పుడు వీరిద్దరి మధ్య ఎఫైర్‌ పోలీస్‌ స్టేషన్లు, కేసుల దాకా వెళ్లింది. ఈ కేసు ఇప్పుడు దర్యాప్తులో వుంది. లావణ్య తన ఫిర్యాదులో, రాజ్‌ తరుణ్‌ కి ఈ ’తిరగబడరా సావిూ’ సినిమాలో నటించిన కథానాయకురాలు మాల్వి మల్హోత్రాకు మధ్య సంబంధం వుంది అని ఆరోపించింది.

ఆధారాలు కూడా పోలీసులకి ఇచ్చినట్టుగా తెలిసింది. అయితే ఇదే సమయంలో రాజ్‌ తరుణ్‌, మాల్వి మల్హోత్రాలు నటించిన ఈ సినిమాని ఆగస్ట్‌ 2న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చెయ్యడానికి నిర్వాహకులు సన్నద్ధం అయ్యారు. రాజ్‌ తరుణ్‌, మాల్వి మల్హోత్రా ఈ ఇద్దరూ ఇప్పుడు వివాదంలో ఉండడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది.  ఆ వివాదం ఈ సినిమాకి  ప్లస్‌ అవుతుందా, లేక మైనస్‌ అవుతుందా అన్న చర్చ నడుస్తోంది. ఈ సినిమాలో ఇంకో కథానాయకురాలి మన్నారా చోప్రా కూడా వుంది. దర్శకుడు ఏఎస్‌ రవికుమార్‌ చౌదరి చాలా సంవత్సరాల తరువాత ఈ సినిమాతో ప్రేక్షకుల ముందుకు  వస్తున్నారు. ఇంతకు ముందు అతను ’యజ్ఞం’, ’వీరభద్ర’, ’ఆటాడిస్తా’, ’పిల్లా నువ్వులేని జీవితం’ లాంటి సినిమాలు చేశారు. ఇప్పుడు చాలా విరామం తరువాత ’తిరగబడరా సావిూ’ అనే ఈ సినిమాకి దర్శకత్వం వహించి ఆగస్టు 2వ తేదీన వస్తున్నారు.

ఇంకా చదవండి: వేయికోట్ల క్లబ్బులో 'కల్కి'... ప్రభాస్‌ కర్ణుడి గెటప్‌ విడుదల!


# Tiragabadarasaami     # Rajtarun     # Malvimalhotra    

trending

View More