అవన్నీ ఫేక్ కలెక్షన్లు : బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ విధు వినోద్ చోప్రా సంచలన కామెంట్
5 hours ago | 5 Views
బాలీవుడ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్ విధు వినోద్ చోప్రా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఆయన నిర్మాతగా మున్నాభాయ్ సిరీస్, 3 ఇడియట్స్ వంటి గొప్ప చిత్రాలను నిర్మించాడు. డైరెక్టర్ గాను కూడా ఎన్నో గొప్ప సినిమాలు తీసిన గతేడాది రిలీజైన ‘12 ఫెయిల్’ సినిమా మాత్రం అందరికి గుర్తుండిపోతుంది. తాజాగా ఆయన ‘రీస్టార్ట్ ఫ్రమ్ జీరో’ అనే డాక్యుమెంటరీని తెరకెక్కించాడు. అది థియేటర్ లలో ఆడలేదు. దీంతో ఆయన స్పందిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు. సినిమా టైమింగ్‌లు. గతేడాది రిలీజైన '12 ఫెయిల్’ సినిమా థియేటర్ లతో పాటు ఓటీటీలోను సంచలన విజయాన్ని నమోదు చేసుకుంది. కేవలం హిందీ, కన్నడ భాషల్లోనే తెరకెక్కిన ఈ సినిమా క్రేజ్ ని చూసి తెలుగు, తమిళ భాషల్లో డబ్ చేశారు. ఈ ఏడాది ‘12 ఫెయిల్’ కి బ్యాక్ గ్రౌండ్ గా తెరకెక్కిన ‘రీస్టార్ట్ ఫ్రమ్ జీరో’ని మాత్రం ఆడియెన్స్ ఏ మాత్రం ఆదరించలేదు.దీంతో డైరెక్టర్ నిజాయితీగానే తన అసహనాన్ని వ్యక్తం చేశాడు ఆయన మాట్లాడుతూ.. ‘‘ నా సినిమాకి థియేటర్‌లలో కనీస స్పందన లభించలేదు. దీనిని ఒప్పుకోవడానికి నాకు ఎలాంటి నామోషీ లేదు. అయితే ఈ మధ్య కాలంలో బాలీవుడ్ లో అనేక సినిమాలు ఫెయిల్ అయినా బ్లాక్ బస్టర్ హిట్ అని ఫేక్ కలెక్షన్స్ చెప్పుకోవడం ఫ్యాషన్ అయ్యింది. నేను అలాంటి చీప్ ట్రిక్స్ ఫాలో కాను. సినిమా మార్కెటింగ్ మొత్తం అబద్ధాల మీద నడుస్తోంది. ఈ రోజుల్లో ఆడని సినిమా ఆడలేదని ఎవ్వరూ చెప్పుకోవట్లేదు. ఫేక్ కలెక్షన్లు చూపించి హిట్ అని చెప్పుకుంటున్నారు. వీళ్లే సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెర్స్‌కు డబ్బులు ఇచ్చి సినిమా గురించి గొప్పలు చెప్పించుకుంటారు. కలెక్షన్లు లేని సినిమాకు హౌస్ ఫుల్స్ పడుతున్నట్లు చూపిస్తారు. కానీ థియేటర్లలో మాత్రం జనం ఉండదు. తమ సినిమాను ప్రేక్షకులు చూడలేదని ఎవ్వరూ నిజాయితీగా చెప్పరు. విదేశాల్లో చదువుకుంటున్న నా కూతురికి ఫోన్ చేసి నా సినిమాను జనం చూడట్లేదని చెబితే.. నేనలా చెప్పినందుకు ఆమె షాకైంది’’ అంటూ చెప్పుకొచ్చారు.
ఇంకా చదవండి: నటి పావని కరణంకు ట్రోలింగ్ సెగ
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# బాలీవుడ్ # డైరెక్టర్