ఎవ్వరినీ నొప్పించే ఉద్దేశం లేదు .. అందుకే జాట్‌లో ఆ సీన్‌ తొలగించాం

ఎవ్వరినీ నొప్పించే ఉద్దేశం లేదు .. అందుకే జాట్‌లో ఆ సీన్‌ తొలగించాం

15 days ago | 5 Views

సన్నీడియోల్‌ హీరోగా గోపిచంద్‌ మలినేని తెరకెక్కించిన చిత్రం 'జాట్‌’. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. అయితే, ఇందులో ఓ సన్నివేశం విమర్శలకు దారితీసిన విషయం తెలిసిందే. రణ్‌దీప్‌ హుడా కనిపించే సన్నివేశంపై కొన్ని ప్రాంతాల్లో కేసు నమోదు చేశారు. దీనిపై దర్శకుడు తాజాగా స్పందించారు. ఎవరి మనోభావాలు దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదన్నారు. ఈ సినిమా  టైలర్‌ కట్‌లోనే ఈ సీన్‌ ఉంది. దానిపై సెన్సార్‌ బోర్డ్‌ ఏ అభ్యంతరం తెలుపలేదు. అయితే సినిమాలో ఈ సన్నివేశం ఉన్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌ బ్లర్‌ చేయాలని సూచించింది.


ప్రేక్షకులు అభ్యంతరం చెప్పకముందే దీన్ని బ్లర్‌ చేశాం. బ్లాక్‌బస్టర్‌ సినిమాను ప్రతిఒక్కరూ చూస్తారని తెలిసినప్పుడు.. వారి మనోభావాలను దెబ్బతీయాలని ఏ దర్శకనిర్మాత సినిమాలు తీయరు. మేం ప్రేక్షకులను అలరించాలని కోరుకుంటున్నాం. అందుకే దాన్ని తొలగించాం అని తెలిపారు. ఇక ఈ సినిమాలో విమర్శలకు దారితీసిన సన్నివేశాన్ని చిత్రబృందం తొలగించింది. ఆ సీన్‌ విషయంలో క్షమాపణలు చెబుతూ సోషల్‌ విూడియా వేదికగా నోట్‌ విడుదల చేసింది. ‘జాట్‌’ చిత్రంలోని ఓ సన్నివేశంపై నెగెటివ్‌ రియాక్షన్‌ వచ్చింది. ఆ సీన్‌ విషయంలో మేం బాధపడుతున్నాం. దాన్ని తొలగించాం. ఎవరి మనోభావాలూ కించపరిచే ఉద్దేశం మాకు లేదని వివరణ ఇచ్చింది.
ఇంకా చదవండి: పెళ్లి ఎప్పుడో చెప్పలేను.. దానిపై అంతగా ఆసక్తి కూడా లేదు : 'థగ్‌లైఫ్‌' ప్రమోషన్‌లో నటి త్రిష కామెంట్స్‌

Get the latest Bollywood entertainment news, trending celebrity news, latest celebrity news, new movie reviews, latest entertainment news, latest Bollywood news, and Bollywood celebrity fashion & style updates!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# జాట్‌     # గోపిచంద్‌