కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి
1 month ago | 5 Views
ప్రముఖ సంగీత దర్శకుడు ఎమ్.ఎమ్. కీరవాణి ఇంట్లో పెళ్లి సందడి నెలకొంది. ఆయన చిన్న కుమారుడు శ్రీ సింహా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. సీనియర్ నటుడు మురళీ మోహన్ మనవరాలు రాగ మాగంటిని వివాహం చేసుకోబోతున్నాడు.
ఇందులో భాగంగా ఆదివారం రాత్రి ప్రీ వెడ్డింగ్ వేడుకను ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్ గోల్కొండ రిసార్ట్స్‌లో జరిగిన ఈ సెలబ్రేషన్స్‌కు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. దర్శకుడు, కీరవాణి సోదరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ఫ్యామిలీతోపాటు స్టార్ హీరో మహేశ్ బాబు, సితార, నరేశ్, పవిత్రా లోకేశ్ తదితరులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. ఈ ప్రీవెడ్డింగ్ వేడుకలకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. కాగా, శ్రీ సింహా ఇటీవలే ‘మత్తు వదలరా 2’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ మూవీ ‘మత్తు వదలరా’కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రానికి రితేశ్ రానా దర్శకత్వం వహించాడు. జాతి రత్నాలు ఫేం ఫరియా అబ్దుల్లా ఫీ మేల్ లీడ్ రోల్‌లో నటించింది. క్రైమ్ కామెడీగా సెప్టెంబర్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ అందుకుంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమా ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
ఇంకా చదవండి: ఘనంగా జరిగిన కళాప్రపూర్ణ కాంతరావు 101వ జయంతి వేడుకలు