సినిమా చూసి నటుడిని కొట్టిన మహిళ!
1 month ago | 5 Views
శఅంజన్ రామచంద్ర, శ్రావణి హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం చిత్రం 'లవ్ రెడ్డి' . గత వారం థియేటర్లలోకి వచ్చి మంచి ప్రేక్షకుల నుంచి సూపర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా సినిమాలో హీరో హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, క్లైమాక్స్ మూవీ చూసిన ప్రతి ప్రేక్షకుడిని బాగా ఆకట్టుకున్నాయి. అయితే సినిమాకు అనుకున్నంత బజ్, ఓపెనింగ్స్ అభించకపోవడంతో బ్లాక్ బస్టర్ బట్ ఫెయిల్యర్ మీట్ అని ఈవెంట్ పెట్టి టాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యారు. సినిమా బావుందని చూసిన వారంతా చెబుతున్నారని కానీ ప్రేక్షకులను రీచ్ కావట్లేదంటూ తమ ఆవేదనను వెలిబుచ్చారు. ఈ పెయుల్యర్ ఈవెంట్ వార్త, టీమ్ అవేదన కాస్త వైరల్ అవడం.. ఈ విషయం మన రెబల్ స్టార్ ప్రభాస్ దృష్టికి వెళ్లడంతో ఆయన స్పందించి తన సోషల్ మీడియాలో లవ్ రెడ్డి సినిమా రివ్యూస్ వింటున్నాను ఆల్ ది బెస్ట్ మేకర్స్ అని పోస్టు పెట్టడంతో సినిమాకు కాస్త మైలేజ్ కూడా దొరికింది. దీంతో సినిమా గురించి కొద్ది మందికి తెలిసి యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఇప్పుడిప్పుడే లవ్‌రెడ్డి సినిమాను ఆదరిస్తున్నారు.
ఈక్రమంలో లవ్ రెడ్డి సినిమాలో నటించిన నటులంతా సినిమా ఆడుతున్న థియేటర్లకు వెళ్లి స్వయంగా ప్రేక్షకుల స్పందనను తెలుసుకుంటున్నారు. ఈక్రమంలో థియేటర్స్ విజిట్‌కు హైదరాబాద్ నిజాంపేట జీపీఆర్ మాల్‌కు వెళ్లగా అక్కడ సినిమా క్లైమాక్స్ రన్ అవుతుంది. సరిగ్గా అదే సమయంలో ఆ థియేటర్‌లో సినిమా చూస్తున్న ఓ మహిళ హీరోయిన్‌కు, తండ్రి పాత్ర మధ్యలో వచ్చిన ఓ ఎమోషనల్ సన్నివేశాన్ని చూసి తట్టుకోలేక ఆగ్రహంతో అలాగే వెళ్లి అక్కడికి వచ్చిన తండ్రి పాత్రదారి రామస్వామిని నాలుగైదు దెబ్బలు వేసింది. పైగా షర్ట్ చిరిగింది. ఒక్కసారిగా జరిగిన ఈ హాఠాత్ పరిణామంతో అక్కడికి వచ్చిన వారు భయభ్రాంతులకు గుయ్యారు. దీంతో వెంటనే తోటి నటులు అప్రమత్తం అయిన అతనిని కాపాడారు. ఇది కేవలం సినిమానే అని నిజం కాదంటూ సదరు మహిళకు నచ్చ చెప్పారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.
ఇంకా చదవండి: చిరంజీవికి అక్కినేని నాగార్జున ఆహ్వానం .. అక్టోబర్ 28న అవార్డు ప్రదాన కార్యక్రమం
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!
# లవ్ రెడ్డి # శఅంజన్ రామచంద్ర # శ్రావణి