'దేవర' అసలు కథంతా పార్ట్-2లోనే ఉంది: దర్శకుడు కొరటాల శివ వెల్లడి
2 months ago | 5 Views
కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా నటించిన సినిమా 'దేవర’ ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చి మంచి విజయాన్ని అందుకొని ఎన్టీఆర్ అభిమానుల్లో జోష్ నింపింది. దీనికి కొనసాగింపుగా పార్ట్- 2 రానుందని దర్శకుడు గతంలోనే ప్రకటించారు. తాజాగా కొరటాల శివ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ’దేవర 2’ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. దీంతో అభిమానుల అంచనాలు రెట్టింపయ్యాయి.
‘పార్ట్ 2లో జాన్వీ పాత్ర అసాధారణంగా ఉంటుంది. ఆశ్చర్యపోతారు. మొదటిభాగం కంటే రెండోభాగం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. సినిమా చూసే ప్రేక్షకులు సీట్ ఎడ్జికి వస్తారు. ఒక దర్శకుడిగా నేను పార్ట్ 2 విషయంలోనూ ఎంతో నమ్మకంగా, ఆసక్తిగా ఉన్నాను. కథలో అసలు మలుపు పార్ట్ 2లోనే ఉంది. ప్రతీ పాత్ర హైలో ఉంటుంది. ఎన్టీఆర్ అభిమానులందరికీ ఒక్కటే చెబుతున్నా.. పార్ట్1లో విూరు చూసింది 10 శాతమే.. రెండో భాగంలో 100శాతం చూస్తారు. ప్రతీ పాత్రలో ట్విస్ట్ ఉంటుంది. కొన్ని సన్నివేశాలు విూరు జీవితంలో మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి. ఈ విషయంలో ప్రామిస్ చేస్తున్నాను. తారక్ నటన గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అతడు తన పాత్రకు జీవం పోస్తాడు’ అని కొరటాల శివ 'దేవర 2’ విషయంలో ధీమా వ్యక్తంచేశారు. ఇటీవల ఓ ఆంగ్ల విూడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ కూడా 'దేవర 2’ గురించి మాట్లాడిన సంగతి తెలిసిందే. మొదటిభాగం చిత్రీకరణ సమయంలోనే పార్ట్ 2లో కొన్ని సన్నివేశాలు షూట్ చేసినట్లు చెప్పారు. ఫస్ట్ పార్ట్ మంచి విజయం సాధించడంతో వారి బాధ్యత మరింత పెరిగిందన్నారు.'దేవర’ కంటే దాని సీక్వెల్ ఇంకా బాగుంటుందని తెలిపారు. కథ సిద్ధంగా ఉందని.. మెరుగులు దిద్దాలన్నారు. కొరటాల శివ 'దేవర’ కోసం ఎంతో కష్టపడినట్లు తెలిపారు. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకువచ్చిన 'దేవర’ ఇప్పటివరకు రూ.466 కోట్లు వసూలు చేసింది.త్వరలో రూ.500కోట్ల క్లబ్‌లోకి చేరడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు.
ఇంకా చదవండి: రజనీకాంత్ సూచనతో ...'వేట్టయాన్' కథలో మార్పు
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !
# Devara # JrNTR # Janhvikapoor