సంచలనంగా మారిన హీరో   రాజ్‌ తరుణ్‌ ప్రేమ..పెళ్లి వ్యవహారం!

సంచలనంగా మారిన హీరో రాజ్‌ తరుణ్‌ ప్రేమ..పెళ్లి వ్యవహారం!

4 months ago | 42 Views

టాలీవుడ్‌ నటుడు రాజ్‌ తరుణ్‌  తన న్యాయవాది ద్వారా పోలీసులకు సమాధానం ఇచ్చారు. గురువారం పోలీసులు ఎదుట హాజరు కావాలన్న నోటీసులకు లాయర్‌ ద్వారా సమాధానం పంపారు. తాను అందుబాటులో లేనని విచారణకు హాజరు కాలేనని రాజ్‌ తరుణ్‌ తెలిపారు.  కాగా వ్యక్తి గతంగా రాజ్‌ తరుణ్‌ను విచారణ చేయాలనుకుంటున్న పోలీసులు.. మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో  రాజ్‌ తరుణ్‌ ప్రేమ..పెళ్లి వ్యవహారం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. నటి లావణ్య.. నటుడు రాజ్‌ తరుణ్‌, నటి మాల్వీ మల్హోత్ర, ఆమె సోదరుడిపై నార్సింగ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.ఈ క్రమంలో రాజ్‌తరుణ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా తెలుగు రాష్ట్రాల్లో టాలీవుడ్‌ ఇండస్ట్రీలో పెను సంచలనం సృష్టిస్తున్న హీరో రాజ్‌ తరుణ్‌.. హీరోయిన్లు లావణ్య, మాల్వీ మల్హోత్రా కేసులో రోజుకో ట్విస్ట్‌ వెలుగు చూస్తుండగా.. తాజాగా ఊహించని రీతిలో బిగ్‌ ట్విస్ట్‌ చోటుచేసుకుంది.

ఇప్పటి వరకూ రాజ్‌ తరణ్‌ వర్సెస్‌ లావణ్యగా కేసు నడవగా సంచలన విషయాలే వెలుగుచూశాయి. అయితే.. మాల్వీ మల్హోత్రా గురించి షాకింగ్‌ విషయాలు వెలుగు చూడటంతో మరోసారి ఈ కేసు వ్యవహారం ఇండస్ట్రీలో  బర్నింగ్‌ టాపిక్‌ అయ్యింది. మాల్వీ మల్హోత్రాపై ప్రొడ్యూసర్‌ యోగేష్‌ తల్లి సంచలన ఆరోపణలు చేశారు. మాల్వీ బండారం మొత్తం యోగేష్‌ తల్లి బయటపెట్టారు. యోగేష్‌ని ట్రాప్‌ చేసి తమ ఆస్తి కాజేసిందని తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రేమ పేరుతో తన కుమారుడి జీవితాన్ని మాల్వీ నాశనం చేసిందన్నారు. తప్పుడు కేసుతో యోగేష్‌ను జైలుకు పంపిందంటూ ఆమె ఆరోపించారు. నాలుగేళ్లుగా మాల్వీ ఇబ్బంది పెడుతోందంటూ కంటతడి పెట్టారు. 2020లో ముంబైలో ఉన్నప్పుడు మాల్వీపై యోగేష్‌ కత్తితో దాడి చేసిన ఘటన అందరికీ గుర్తుండే ఉంటుంది. మాల్వీ పెళ్లికి ఒప్పుకోవట్లేదని దాడి చేశాడంటూ అప్పట్లో వార్తలు గుప్పుమన్నాయి. నాడు జరిగిన అన్ని విషయాలు విూడియా వేదికగా వివరించడంతో పాటు.. మాల్వీ`యోగేష్‌ కాల్‌ లిస్ట్‌ కూడా యోగేష్‌ తల్లి బయటపెట్టడంతో ఈ కేసులో మరో ట్విస్ట్‌ చోటుచేసుకున్నట్లు అయ్యింది. ఈ సంచలన ఆరోపణలపై ఇంతవరకూ రాజ్‌ తరుణ్‌ కానీ.. మాల్వీ కానీ స్పందించలేదు.

ఇంకా చదవండి: 'యానిమల్‌'తో ఎంతో నేర్చుకున్నా: తృప్తి దివ్రిూ

# RajTharun     # MalviMalhotra     # Lavanya    

trending

View More