'లింగ' సెకండాఫ్ మొత్తం మార్చేశారు: దర్శకుడు కె.ఎస్ రవికుమార్ సంచలన వ్యాఖ్యలు!
2 months ago | 5 Views
అగ్ర కథానాయకుడు రజనీకాంత్ పై దర్శకుడు కె.ఎస్.రవికుమార్ ఆరోపణలు చేశారు. తమ కాంబోలో వచ్చిన 'లింగ’ ఎడిటింగ్‌లో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారని అన్నారు. ఇటీవల ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రవికుమార్ ఆ సినిమా పరాజయం గురించి మాట్లాడారు. ఎడిటింగ్ విషయంలో రజనీకాంత్ జోక్యం చేసుకున్నారు. సీజేఐ (కంప్యూటర్ గ్రాఫిక్స్)కు నాకు ఏమాత్రం సమయం ఇవ్వలేదు. సెకండాఫ్ మొత్తాన్ని ఆయన మార్చేశారు. అనుష్కతో ఉండే ఒక పాట, క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్‌ను తొలగించేశారు. కృతిమంగా ఉండే బెలూన్ జంపింగ్ సీన్ యాడ్ చేశారు. 'లింగ’ను గందరగోళం చేశారని రవికుమార్ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్‌గా మారాయి.
కె.ఎస్.రవికుమార్‌కు కోలీవుడ్‌లో దర్శకుడిగా మంచి పేరు ఉంది. రజనీకాంత్‌తో ఆయన గతంలో 'ముత్తు’, 'నరసింహ’ చిత్రాలు తెరకెక్కించి విజయాన్ని అందుకున్నారు. వీరిద్దరి కాంబోలో 2014లో వచ్చిన చిత్రమే 'లింగ’. భారీ బడ్జెట్‌లో యాక్షన్ కామెడీ ఫిల్మ్‌గా ఇది తెరకెక్కింది. రజనీకాంత్ ద్విపాత్రాభినయంలో కనిపించారు. సోనాక్షిసిన్హా, అనుష్క కథానాయికలు. ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.150 కోట్లకు పైగా గ్రాస్ వసూలుచేసింది. మంచి వసూళ్లు రాబట్టినప్పటికీ పరాజయం అందుకుంది. ఈ సినిమా ఫలితం గురించి 2016లో రవికుమార్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా మా సినిమా రూ.150 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అది అంత సులభం కాదు. కలెక్షన్లపరంగా మా సినిమా సూపర్‌హిట్‘ అని చెప్పారు.
ఇంకా చదవండి: అన్నీ ఏజ్ గ్రూప్స్ వాళ్లకి నచ్చే సినిమా ‘జనక అయితే గనక’ : డైరెక్టర్ సందీప్ రెడ్డి బండ్ల