హాలీవుడ్‌ ఈవెంట్‌లో 'దేవర' ప్రదర్శన.. అభిమానుల్లో జోష్‌ పెంచిన వార్త!

హాలీవుడ్‌ ఈవెంట్‌లో 'దేవర' ప్రదర్శన.. అభిమానుల్లో జోష్‌ పెంచిన వార్త!

3 months ago | 32 Views

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'దేవర’భారీ అంచనాల మధ్య 27న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా దీనికి సంబంధించిన ఓ వార్త అభిమానుల్లో జోష్‌ నింపుతోంది. హాలీవుడ్‌లో జరగనున్న ఓ ఈవెంట్లో ;దేవర’ను ప్రదర్శించనున్నారు. కాలిఫోర్నియాలోని లాస్‌ ఏంజెలిస్‌లో జరగనున్న అతిపెద్ద జానర్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ 'బియాండ్‌ ఫెస్ట్‌’లో ’దేవర’ను ప్రదర్శించనున్నారు. సెప్టెంబర్‌ 25 నుంచి అక్టోబర్‌ 9 వరకు ఈ ఈవెంట్‌ జరగనుంది. సెప్టెంబర్‌ 26 సాయంత్రం ఈజిప్టియన్‌ థియేటర్‌లో ఈ సినిమాను హాలీవుడ్‌ ప్రేక్షకులు, ప్రముఖులు  వీక్షించనున్నారు. దీనికోసం ఎన్టీఆర్‌ సెప్టెంబర్‌ 25న అమెరికా వెళ్లనున్నారని సినీవర్గాలు తెలిపాయి. ఈ విషయం తెలిసిన అభిమానులు తెగ సంబరపడుతున్నారు. తాజాగా దీని ట్రైలర్‌ రిలీజ్‌ ఈవెంట్‌లో పాల్గొన్న ఎన్టీఆర్‌ సినిమాపై అంచనాలు పెంచేశారు. 'దేవర’ విజువల్స్‌ అద్భుతంగా ఉంటాయన్నారు. చివరి 40 నిమిషాల సినిమా విశేషంగా ఆకట్టుకుంటుందని తెలిపారు. ఈ సినిమాతో జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌లోకి వస్తున్నారు.


సైఫ్‌ అలీఖాన్‌ కీలకపాత్రలో కనిపించనున్నారు. యాక్షన్‌ డ్రామాగా ముస్తాబవుతోన్న ఈ సినిమా ప్రీసేల్‌ బుకింగ్స్‌లోనే పలు రికార్డులు సొంతం చేసుకుంది. నార్త్‌ అమెరికన్‌ బాక్సాఫీస్‌లో అత్యంత వేగంగా టికెట్ల ప్రీసేల్‌ ద్వారానే వన్‌ మిలియన్‌ డాలర్ల మార్క్‌ను చేరిన సినిమాగా 'దేవర’ నిలిచింది. ట్రైలర్‌ కూడా రిలీజ్‌ కాకముందే ఈ ఘనత సాధించిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డు నెలకొల్పింది. తాజాగా విడుదలైన ఈ ట్రైలర్‌ కూడా మంచి ప్రేక్షకాదరణను సొంతం చేసుకుంది.

ఇంకా చదవండి: డబ్బింగ్‌లో చెప్పి..డైలాగ్‌ నడిపించా: 'ఛత్రపతి' చిత్రీకరణపై ప్రభాస్‌!

HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON!

# Devara     # JrNTR     # Janhvikapoor    

trending

View More