'ఆర్య' సినిమా అంతా భగవదేచ్ఛ.. అనుకోకుండా అంతా కలసి సక్సెస్  చేశారు!

'ఆర్య' సినిమా అంతా భగవదేచ్ఛ.. అనుకోకుండా అంతా కలసి సక్సెస్ చేశారు!

1 month ago | 18 Views

'ఇడియట్‌’ సినిమా చూసి.. ఇలాంటి సినిమా మనకు పడుద్దా’ అనుకున్నాను. 'ఆర్య’ కథ వినగానే 'దిసీజ్‌ మై ఇడియట్‌’ అనే ఫీలింగ్‌ కలిగింది. రిలీజయ్యాక నాన్న 'టెన్‌ వీక్స్‌ సినిమా’ అంటే నేనూ, సుకుమార్‌ ఉడికిపోయాం. ‘ఆర్య’ సినిమాకు 125 డేస్‌ షీల్డ్‌ తీసుకోకపోతే నా పేరు మార్చుకుంటాను’ అని ఆ క్షణమే నాన్నతో సవాల్‌ చేశా. దాన్ని నిజం చేస్తూ చిరంజీవి గారి చేతుల విూదుగా షీల్డ్‌ అందుకొని నా మాట నిలబెట్టుకున్నాను’ అని అల్లు అర్జున్‌ అన్నారు. ఆయన కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో దిల్‌ రాజు నిర్మించిన 'ఆర్య’ చిత్రం విడుదలై 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా '20 ఏళ్ల ఆర్య’ పేరుతో  చిత్రబృందం హైదరాబాద్‌లో రీ యూనియన్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్‌ మాట్లాడుతూ 'లైఫ్‌లో నాకు ఫస్ట్‌ సక్సెస్‌ అంటే ఆర్యనే. మళ్లీ అలాంటి సక్సెస్‌ నాకు దక్కలేదు. 'గంగోత్రి’ సక్సెస్‌ అయింది. అయినా నేను చూడడానికి అంత గొప్పగా ఏం లేనని హీరోగా అవకాశాలు రాలేదు. అలా ఒక ఏడాది ఖాళీగా కూర్చున్నాను. 'దిల్‌’ చిత్రం ప్రివ్యూకు వెళితే, అక్కడ నన్ను చూసి సుకుమార్‌ కథ చెప్పారు. నాకు మైండ్‌ బ్లోయింగ్‌ అనిపించింది. కొత్తవాళ్లని నమ్మి దిల్‌రాజు గారు డబ్బులు పెట్టి, రిస్క్‌ చేశారు. ఆయన లేకపోతే మేము ఎవ్వరం లేము. సుకుమార్‌కు దర్శకుడిగా తొలి చిత్రం కావడంతో ఆయన ఈ సినిమాను తీయగలరా? లేదా అనే సందేహం నాన్నకు వచ్చింది. అప్పుడు వివి వినాయక్‌ గారు 'ఆ కుర్రాడు (సుకుమార్‌) తీయగలడు.విూరు ముందుకెళ్లండి’ అని భరోసా ఇచ్చారు.

చిరంజీవి గారు కూడా కథ విని 'బాగుంది’ అని సపోర్ట్‌ చేశారు. ఆయన చేతుల విూదుగా షీల్డ్‌ అందుకున్నాను. 'ఆర్య’తో దిల్‌రాజు పెద్ద నిర్మాతగా ఆవిర్భవించారు. ఇండియాలో నంబర్‌ వన్‌ డైరెక్టర్‌ స్థాయిలో సుకుమార్‌ ఉన్నారు. మమ్మల్ని ఇంతలా ఆదరించిన తెలుగు ప్రేక్షకులకు రుణపడి ఉంటాను'' అన్నారు అల్లు అర్జున్‌. దిల్‌ రాజు మాట్లాడుతూ ‘ఆర్య’ సినిమాతో ఎంతోమంది జీవితాల్లో అద్భుతం జరిగింది. మరే ఇండస్ట్రీలోనూ ఇలాంటి ఈవెంట్‌ జరగలేదు. 'ఆర్య’ కోసం తొలుత రవితేజ, ప్రభాస్‌ను కలిశాం. చివరకు బన్నీతో కుదిరింది. సుక్కు కథను చెబుతుంటే బన్నీ ఒక్కో సీన్‌ను రాసుకున్నాడు. అరవింద్‌ గారిని కూడా ఒప్పించాడు. మేకింగ్‌ విషయంలో సుకుమార్‌ తో గొడవ పడేవాణ్ణి. ఓసారి మూడు రోజులు ఇద్దరం మాట్లాడుకోలేదు. మేం అందరం పాన్‌ ఇండియా స్థాయిలో సక్సెస్‌ అవుతున్నాం అంటే 'ఆర్య’ ఇచ్చిన సక్సెస్‌ కారణం’ అని చెప్పారు. సుకుమార్‌ మాట్లాడుతూ 'దిల్‌రాజు సినిమా చేద్దామని మాట ఇచ్చారు గానీ అవకాశం ఇస్తారనుకోలేదు. బన్నీకి కథ చెప్పాక నన్ను తన కారులో మా ఆఫీసు దగ్గర దింపాడు. అరవింద్‌ గారికి మళ్లీ మళ్లీ కథ చెప్పలేక వెనక్కి వెళ్లి మళ్లీ లెక్చరర్‌గా చేరుదాం అనుకున్నాను. అరవింద్‌ గారు చెబితే చిరంజీవి గారికి కథ చెప్పాను. 20 నిమిషాలు టైమ్‌ ఇచ్చారు. కానీ 3 గంటలు విన్నారు. 'సినిమా హిట్‌ ముదుకెళ్లండి’ అన్నారు. ఒక్క మాంటేజ్‌ షూట్‌ కోసం దిల్‌రాజు కాళ్లు పట్టుకున్నాను. సినిమా బాగా రావడానికి కనీసం మూడుసార్లు అలా చేసి ఉంటాను’ అన్నారు. అల్లు అరవింద్‌ మాట్లాడుతూ'ఆర్య’ టీం ఇవ్వాల్టికీ టాప్‌లో ఉంది. ఏదో దైవిక శక్తి ఆ సినిమా విషయంలో అందరినీ ముందుకు నడిపించింది. ఇంత మంచి చిత్రంలో భాగమైనందుకు సంతోషంగా ఉంది’ అన్నారు.

ఇంకా చదవండి: జాన్వీ పెళ్లి తిరుపతిలోనే అంటూ..నెటిజన్ల పోస్టులు... మీ ఇష్టమేనా అంటూ రిప్లై ఇస్తూ..ర్యూమర్స్‌కు చెక్‌!!

# Aarya     # AlluArjun     # Sukumar     # TeluguCinema    

trending

View More