ఎన్టీఆర్‌గారితో జర్నీ నాకెప్పుడూ స్పెషలే.. ‘దేవర’ మూవీ అందరికీ కన్నుల పండుగలా ఉంటుంది - దర్శకుడు కొరటాల శివ
1 month ago | 26 Views
మ్యాన్ ఆఫ్ మాసెస్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వం వహించారు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ సినిమాలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో నటించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గ్రాండ్ రిలీజ్ అవుతోంది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కొరటాల శివ ‘దేవర’ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ..
* ‘దేవర’ సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతోంది. ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ కోసం వెయిట్ చేసేటప్పుడు ఉండే ఎగ్జయిట్‌మెంటో, నెర్వస్‌నెస్ ఏదైనా అనుకోవచ్చు.. మనసులో అలా ఉంది. ప్రతి సినిమా రిలీజ్‌కు ముందే ఉండేదే.
* ‘దేవర’ మూవీ కథ అంతా పిక్షనల్. ఎక్కడా నిజ ఘటనలను ఆధారంగా చేసుకోలేదు.
* మనిషికి మితిమీరిన ధైర్యం కూడా కరెక్ట్ కాదు. అది మూర్ఖత్వం అవుతుంది. మనకు తెలియకుండానే మనలో ఓ భయం ఉంటుంది. దాన్ని గౌరవించాలని చెప్పటమే ‘దేవర’ కథ. భయం లేకుండా ఉండాలనుకోవటం తప్పు. లా ఆఫ్ ల్యాండ్ అనేది ఒకటి ఉంటుంది కదా. దాన్ని అందరూ పాటించాలి. అదే భయం అంటే. ఉదాహరణకు ట్రాఫిక్ దగ్గర రెడ్ సిగ్నల్ పడగానే అందరం ఆగుతాం. ఎందుకు ఆగాలి.. వెళ్లిపోవచ్చు కదా అనుకోవచ్చు. కానీ మనలో ఆగాలనే చిన్నపాటి భయం ఉంటుందిగా. అందుకే ఆగుతాం. అలాంటి భయం మనిషికి ఎంతో అవసరం.. మంచిది కూడా. అదే నేను ‘దేవర’ సినిమాలో చెప్పాను. జవాబుదారీతనం కూడా ఓ భయమే. ఇలాంటి భయం ఉండటం వల్ల మనం చేసే పనిని చెక్ చేసుకుని మంచి రిజల్ట్ పొందుతాం.
* ఎన్టీఆర్‌గారితో జర్నీ ఎప్పుడూ నాకు స్పెషలే. ఏ విషయం అయినా ఆయనతో డిస్కస్ చేసినప్పుడు బాగున్నా, బాగోలేకపోయినా డిప్లొమెటిక్‌గా సమాధానం చెప్పరు. ఓపెన్‌గా మనసులో ఉన్న భావాన్ని చెబుతారు. ‘దేవర’ లైన్ చెప్పినప్పుడు ఆయన స్పందించిన తీరుతోనే నెక్ట్స్ లెవల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాం.
* ‘దేవర’ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లటానికే 6 నెలలు సమయం తీసుకున్నాం. సముద్రంపై ఎలా షూట్ చేయాలి.. అక్కడ లైటింగ్ వేరియేషన్స్ ఉంటాయి. మనం సముద్రాన్ని ఎలా క్రియేట్ చేసుకోవాలి..దాన్నెలా చేయాలనే అంశాలపై స్టడీ చేశాం. అందుకనే సమయం తీసకున్నాం. ఎందుకంటే ఇలా షూటింగ్ ఎవరూ చేయకపోవటం వల్ల మనకు సలహాలిచ్చేవాళ్లు లేరు. అందుకే సమయం పట్టింది.
* మన టెక్నీషియన్స్ గురించి ఎంత చెప్పినా తక్కువే. చాలా టాలెంటెడ్. మనవాళ్లు ప్రిపరేషన్ లేకుండా వెళ్లినా ఎగ్జిక్యూట్ చేయగలరు. హాలీవుడ్ టెక్నీషియన్స్ అలా కాదు. వాళ్లు ప్రిపేర్ కాకపోతే భయపడిపోతారు. ప్రతీ సన్నివేశాన్ని రిహార్సల్స్ చేసుకుని వెళతారు. అదే లాస్ట్ మినిట్ టెన్షన్‌లోనూ పని చేయటం మన వాళ్లకు అలవాటే. అదే మన వాళ్లకు హాలీవుడ్ టెక్నీషియన్స్ తరహాలో ప్రిపరేషన్ టైమ్ ఇస్తే.. ఇంకా అద్భుతాలు చేస్తారు.
* ‘ఆచార్య’ సినిమా రిలీజ్ తర్వాత ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే దానికి ఒత్తిడేం పడలేదు. ఈ సినిమాకు ఇంకా బాగా ప్రిపేర్ అయ్యాను. ఆచార్య రిలీజైన 20 రోజుల్లోనే దేవర సినిమా మోషన్ పోస్టర్ పనిలో పడ్డాను.
* ‘దేవర’ సెకండ్ షెడ్యూల్ సమయంలో ఇంత పెద్ద కథను మూడు గంటల్లోపు చెప్పగలమా! అనే అందరం అనుకున్నాం. ఎందుకంటే నెరేషన్ 4 గంటలుంది. పేపర్ మీద పెట్టినప్పుడు అది 6-7 గంటలు వస్తుంది. సెకండ్ షెడ్యూల్ అప్పుడే మూడు గంటల్లో ఈ కథను చెప్పలేమని అర్థమైంది. రెండు పార్టులు వద్దనుకునే రివర్స్‌లో వెళ్లాం. కానీ కుదరదని తెలిసిపోయింది. దాంతో రెండు భాగాలుగా చేయాలని నిర్ణయించుకున్నాం. ఇదేదో బిజినెస్ కోసమో, సెన్సేషన్ కోసమో కాదు చేసింది. ఓ పార్టులో చెప్పలేని కథను రెండు భాగాలుగా చెప్పాలి.
* లక్కీగా ‘దేవర’సినిమాకు సాబు శిరిల్, రత్నవేలు, శ్రీకర్ ప్రసాద్, అనిరుద్ వంటి టాప్ టెక్నీషియన్స్ కుదిరారు. ఎవరికీ స్పూన్ ఫీడింగ్ ఇవ్వాల్సిన పని లేదు. అందుకనే వాళ్ల ఐడియాస్‌తో వర్క్ చేసుకుని వచ్చారు. అందరూ మంచి టెక్నీషియన్స్ కాబట్టి మంచి ఇన్‌పుట్స్ ఇచ్చారు.
* టీమ్ అందంర ఎన్టీఆర్‌గారి కోసం చివరి నిమిషం వరకు ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టేశాం. ఇక రిజల్ట్ విషయమంటారా! అదెప్పుడూ మన చేతిలో ఉండదు.
* ‘దేవర’.. అంటే ఎన్టీఆర్ పాత్ర చుట్టూ తిరిగే కథ. ఆయనే హీరో.. అలాంటప్పుడు ఆ పాత్రలో ఎన్టీఆర్‌గారిని కాకుండా మరొకరిని ఎలా అనుకుంటాను. కథ రాసుకునేటప్పుడే రెండు పాత్రలకు ఎన్టీఆర్‌గారిని అనుకునే రాసుకున్నాను. దేవర కొడుకు వర.. పాత్ర ఆయన్ని మించేలా ఉంటుంది. దేవర రెండు భాగాల్లోనే పూర్తయ్యే సినిమా.
* నాకు, చిరంజీవిగారికి ఎప్పుడూ మంచి అనుబంధం ఉంది.. ఉంటుంది. ఆచార్య తర్వాత ఈసారి నువ్వు ఇంకా గట్టిగా హిట్ కొడతావంటూ మెసేజ్ పెట్టిన మొదటి వ్యక్తి ఆయన. అలాంటి నాకు, ఆయన మధ్య తేడాలెందుకుంటాయి.
* జాన్వీ కపూర్ శ్రీదేవి కుమార్తె అని కానీ.. ప్రతి విషయం ఎంతో జాగ్రత్తగా నేర్చుకుని మరీ చేసింది. దేవర సినిమాలో మనిషిలో భయం ఉండాలని నేను చెప్పే ప్రయత్నం చేశాను. ఆ భయాన్ని నేను జాన్వీలో చూశాను. వారం, పది రోజుల ముందు నుండే సీన్ పేపర్ కావాలని నన్ను అడిగి తీసుకుని ప్రాక్టీస్ చేసుకుని సెట్స్‌కు వచ్చేది. ఫస్ట్ డే షూటింగ్‌లో ఆమె నటించిన సీన్ కాగానే తారక్‌గారు ఫెంటాస్టిక్ అంటూ చేయి చూపించారు.
* సైఫ్ అలీఖాన్‌గారిని ఓంకార సినిమా చూసినప్పడు భైర పాత్రకు సరిపోతాడనిపించింది. అయితే ఈయనలో నార్త్ లుక్ ఉంటుందేమోనని భయపడ్డాను. ఇదొక రూటెడ్ ఫిల్మ్‌లాగా ఉందిగా.. నాకు లుక్ సెట్ అవుతుందా! అని సైఫ్‌గారు కూడా అనుమానం వ్యక్తం చేశారు. అయితే నేను లుక్ టెస్ట్ చేద్దామని చెప్పి .. స్కెచ్ వేసి పంపాను. ఆయనే ముందు నమ్మలేదు. షూటింగ్ జరిగే సమయంలో ఓ గంట ముందు లొకేషన్‌కు వచ్చి ప్రిపేర్ అయ్యేవారు. చివరగా అవుట్‌పుట్ చూసినప్పుడు భైర ఎలా ఉండాలని నేను అనుకున్నానో తను అలాగే ఉన్నారు.
* అనిరుద్ మ్యూజిక్ పట్ల నేను హండ్రెడ్ పర్సెంట్ హ్యాపీగా ఉన్నాను. ఫియర్ సాంగ్ రిలీజ్ అనుకున్నప్పుడు ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడోనని అనుకున్నాను. కానీ నా కాన్సెప్ట్ వినగానే తను క్యాచ్ చేసుకుని అద్భుతమైన సాంగ్ ఇచ్చాడు. అప్పుడు తను సింక్‌లో ఉన్నాడనిపించింది. త్వరలోనే ఆయుధపూజ సాంగ్‌ను రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నాం.
* దేవర సినిమా సెప్టెంబర్ 27న మీ ముందుకు రానుంది. అందరికీ ఓ కన్నుల పండుగలా ఉంటుంది.
* దేవర సినిమా మీదనే ఫోకస్‌గా ఉన్నాం.. నెక్ట్స్ మూవీ ఏంటనేది ఇంకా ఆలోచించలేదు.
ఇంకా చదవండి: 'దేవర' ప్రీ రిలీజ్ రద్దు..పుష్ప మేకర్స్ జాగ్రత్తలు!
HOW DID YOU LIKE THIS ARTICLE? CHOOSE YOUR EMOTICON !